మలయాళ సినిమా పరిశ్రమను(Malayalam Cinema Industry) జస్టిస్‌ హేమ(Justice Hema) కమిటీ నివేదిక కుదిపేస్తున్నది.

మలయాళ సినిమా పరిశ్రమను(Malayalam Cinema Industry) జస్టిస్‌ హేమ(Justice Hema) కమిటీ నివేదిక కుదిపేస్తున్నది. చిత్రసీమకు చెందిన మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ చేదు అనుభవాలను బహిరంగపరుస్తున్నారు. వారు చెప్పే విషయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహిళా ఆర్టిస్టులపై కొందరు హీరోలు, ఇతర సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక తెలిపింది. ఇప్పుడీ బురద కాంగ్రెస్‌ పార్టీకి(Congress party) కూడా అంటుకుంది. అధినేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న మహిళలకే పార్టీలో అవకాశాలు వస్తాయని, లేకపోతే వేధింపులు తప్పవని ఓ మహిళా కాంగ్రెస్‌ నేత చేసిన ఆరోపణనలు పార్టీని కుదిపేస్తున్నది. ఆరోపణలు చేసిన ఆమెను పార్టీ అధిష్టానం వెంటనే పార్టీ నుంచి బహిష్కరించిందనుకోండి.. క్యాస్టింగ్‌ కౌచ్‌(Casting Couch)ఆరోపణలు మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంటే, కాంగ్రెస్‌ పార్టీలో కూడా అలాంటి పరిస్థితే ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత సిమీ రోజ్‌బెల్‌ జాన్‌ ఆరోపించారు. పార్టీలో తాము ఎదుర్కొన్న బాధలను, దాడులను, చేదు అనుభవాలను చాలా మంది మహిళలు తనతో పంచుకున్నారని ఆమె తెలిపారు. పార్టీకి చెందిన మహిళలపై కొందరు పురుష నాయకులు అభ్యంతరకరంగా ప్రవర్తించారని సిమీ రోజ్‌బెల్‌ జాన్‌(Rosebell Jan) అన్నారు. పదవులు ఆశచూపి కొంతమంది సీనియర్‌ నేతలు మహిళలను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారని ఆరోపించారు. వీటికి సంబంధించిన ఆధారాలు తగిన సమయంలో బయటపెడతానన్నారు. తనపై ఫిర్యాదు ఇచ్చిన వారు కూడా దీనిని గమనించాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ జేబీ మేథర్‌ (Jebi Mather)పేరును, మరికొందరి పేర్లను ఆమె బయటకు వెల్లడించారు. పార్టీలో వారికి అనవసర గౌరవాలు దక్కాయని ఆరోపించారు. మహిళా కాంగ్రెస్‌లో ఎనిమిదేళ్ల క్రితమే చేరిన ఆమెకు ఆల్ ఇండియా యూత్‌ కాంగ్రెస్‌ సెక్రటరీ పదవి కట్టబెడితే తాము మౌనంగా ఉండిపోవాల్సి వచ్చిందని సిమీ రోజ్‌బెల్ జాన్‌ అన్నారు. అధిష్ఠానం ఆదేశాలను అనుసరించడానికి నిరాకరించిన మహిళలపై కొందరు నేతలు నీచంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. అదే సమయంలో కొంతమంది మహిళల పట్ల మాత్రం ప్రేమాప్యాయతలు కురిపిస్తున్నారని విమర్శించారు. ఇంతటి భయంకరమైన ఆరోపణలు చేసిన ఆమెను పార్టీ బహిష్కరించకుండా ఉంటుందా? ఆమె ఆరోపణలలోని నిజమెంతో తెలుసుకోకుండా ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది.

ehatv

ehatv

Next Story