రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్రమోదీ హయాంలో నాటిన విత్తనాలను మొలకెత్తించే ఎజెండాలో భాగమే ఈ సినిమా అని ఆయన ఆరోపించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలయ్యింది. ట్రైలర్‌పై వివిధ వర్గాలు మండిపడ్డాయి. విమర్శలు వెల్లువెత్తాయి. కేరళ నుంచి కొందరు మహిళలు తప్పిపోవడం, వారు ఇస్లాం మతంలోకి మారిపోవడం, అటు పిమ్మట వారిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడటం .. ఇలాంటి వాటి చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది.

బాలీవుడ్‌ మూవీ ది కేరళ స్టోరీపై కేరళలోని రాజకీయపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ ఆ అభూత కల్పనల సినిమాను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కట్టకథల ఆధారంగా తీసిన ఆ సినిమా కేరళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ప్రతిపక్ష నేత వి.డి.సతీషన్‌ అన్నారు. సినిమా విడుదలను ఆపాలని పట్టబడుతున్నారు. కేరళలో 32 వేల మంది అమ్మాయిలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్టు, తర్వాత వారిని ఉగ్రవాదసంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేర్చినట్టు సినిమాలో చూపించారని, ఇంతకంటే పచ్చి అబద్ధం మరోటి ఉండదని సతీషన్‌ అంటున్నారు. దర్శకుడు సుదీప్తో సేన్‌ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్ని అవాస్తవాలేనని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కేరళకు చెడ్డపేరు తీసుకురావడమే దర్శకుడి లక్ష్యంగా కనిపిస్తోందని మండిపడ్డారు. కేరళను అవమానించడానికి, దూషించడానికి అతడు ఎంచుకున్న మార్గమే ఈ సినిమా అని చెప్పారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్రమోదీ హయాంలో నాటిన విత్తనాలను మొలకెత్తించే ఎజెండాలో భాగమే ఈ సినిమా అని ఆయన ఆరోపించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలయ్యింది. ట్రైలర్‌పై వివిధ వర్గాలు మండిపడ్డాయి. విమర్శలు వెల్లువెత్తాయి. కేరళ నుంచి కొందరు మహిళలు తప్పిపోవడం, వారు ఇస్లాం మతంలోకి మారిపోవడం, అటు పిమ్మట వారిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడటం .. ఇలాంటి వాటి చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది. సినిమా మేకర్స్‌ 32 వేల మంది తప్పిపోయినట్టు చూపించారు. ఇంత చెత్తను నింపి సినిమా తీశారని సీపీఎం కూడా అంటోంది.

లాస్టియర్‌ నవంబర్‌లో ఓ ట్రైలర్‌ వచ్చినప్పుడే సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఓ లేఖ కూడా రాశారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ మామ్‌కూటత్తిల్‌, యూత్‌ లీగ్‌ ప్రధాన కార్యదర్శి పి.కె.ఫిరోజ్‌లతో కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు. సంఘ్‌పరివార్‌ ఎజెండాను అమలు చేయడానికి ఈ సినిమా ద్వారా ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకుడు సినిమా ద్వారా ఏం చెప్పదల్చుకున్నడన్నది ట్రైలర్‌తోనే అర్థమవుతోందని కేరళలోని అధికార, విపక్షాలు అంటున్నాయి. కేరళను మతపరంగా విడదీయాలనుకుంటున్న బీజేపీ కుట్రలు సాగావని చెబుతున్నాయి. ఈ విషయంలో యావత్‌ కేరళ ఐక్యంగా నిలబడుతుందని వివరించాయి. మానవత్వం అనే పదానికి సంఘ్‌పరివార్‌కు అర్థం తెలియదని, మతోన్మాద విషయం చిమ్మి కేరళను విభజించవచ్చని బీజేపీ అనుకుంటోంది కానీ, ఇక్కడ ఆ పార్టీ పప్పులుడకవని స్పష్టం చేస్తున్నాయి.

Updated On 29 April 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story