సంఘ్ పరివార్, దాని పిల్ల వేరు అయిన బీజేపీ(BJP) నేతలు పదే పదే భారత్ మాతాకీ జై, జై హింద్ అనే నినాదాలను ఇస్తూ ఉంటారు. బీజేపీ సభలు, సమావేశాలలో ఈ రెండు నినాదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇప్పుడు జైశ్రీరామ్ కూడా వచ్చి చేరింది.

Kerala CM Pinarayi Vijayan
సంఘ్ పరివార్, దాని పిల్ల వేరు అయిన బీజేపీ(BJP) నేతలు పదే పదే భారత్ మాతాకీ జై, జై హింద్ అనే నినాదాలను ఇస్తూ ఉంటారు. బీజేపీ సభలు, సమావేశాలలో ఈ రెండు నినాదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇప్పుడు జైశ్రీరామ్ కూడా వచ్చి చేరింది. అయితే భారత్ మాతాకీ జై, జై హింద్ అనే నినాదాలను మొట్టమొదటగా ఇచ్చింది ఇద్దరు ముస్లింలేనని, అలాంటప్పుడు ఆ నినాదాలను సంఘ్ పరివార్ వదిలేస్తుందా అని కేరళ(Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) ప్రశ్నించారు. సోమవారం సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పినరయ్ విజయన్ మాట్లాడారు. దేశ చరిత్రలో, స్వాతంత్ర్య ఉద్యమంలో అనేక మంది ముస్లింలు పాల్గొన్నారని, పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారని విజయన్ తెలిపారు.
భారత్ మాతాకీ జై అనే నినాదం మొదటి సారి అజిముల్లా ఖాన్(Azimullah Khan) అనే వ్యక్తి నోటి నుంచి వెలువడిందని, ఆ విషయం సంఘ్ పరివార్(Sangh Parivar) నేతలకు తెలిసి ఉండకపోవచ్చని విజయన్ చెప్పారు. అలాగే జైహింద్ అనే నినాదాన్ని మొదటి సారిగా అబిద్ హసన్ అనే మాజీ దౌత్యవేత్త ఇచ్చారని తెలిపారు.
