ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్‌(London)లో కేరళ బస్సు(Kerala Bus) చక్కర్లు కొడుతోంది. అదేంటి లండన్‌లో కేరళ బస్సు ఏంటి అనుకుంటున్నారా. లండన్‌లో తిరుగుతున్న ఓ బస్సుపై కేరళ ప్రభుత్వం వేసిన ప్రకటనలు ఉన్నాయి.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్‌(London)లో కేరళ బస్సు(Kerala Bus) చక్కర్లు కొడుతోంది. అదేంటి లండన్‌లో కేరళ బస్సు ఏంటి అనుకుంటున్నారా. లండన్‌లో తిరుగుతున్న ఓ బస్సుపై కేరళ ప్రభుత్వం వేసిన ప్రకటనలు ఉన్నాయి. తమ రాష్ట్రంలో టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు కేరళ ప్రభుత్వం వేయించిన ప్రకటనలు అని తెలియడంతో అక్కడున్న భారతీయులు ఈ బస్సు వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. బస్సుపై కేరళ రాష్ట్రానికి చెందిన పర్యాటక అందాల గురించి వివరించారు. కేరళ బ్యాక్ వాటర్, కేరళ అందాలను ఈ ప్రకటనల్లో ప్రదర్శించారు. గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా రాసి ఉంది. ఈ వీడియో ఇప్పుడు ఎక్స్‌లో వైరల్‌గా మారింది. కేరళ రాష్ట్రానికి చెందినవారు, కేరళ టూరిజాన్ని అభిమానిస్తున్నవారు దీనిని షేర్ చేస్తున్నారు. కేరళ టూరిజం తద్వారా భారత టూరిజానికి కూడా ఇది దోహదపడుతుందని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. కేరళ రాష్ట్రానికి చెందినవారయితే మా రాష్ట్రం ఇలా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని, ఇది తమకు గర్వ కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.

https://www.instagram.com/reel/C6TUiPno4jt/?utm_source=ig_embed&ig_rid=ffaad197-3bd4-48e7-82fb-526098f3de95

Updated On 3 May 2024 4:57 AM GMT
Ehatv

Ehatv

Next Story