రాష్ట్ర పేరును 'కేరళం'గా(Keralam) అధికారికంగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ(Kerala Assembly) బుధవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌(CM Pinarayi Vijayan) ఈ ప్రతిపాదనను చేశారు. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పొందుపరిచిన అన్ని భాషల్లో రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఎలాంటి సవరణలు లేదా మార్పులు సూచించకుండానే ఈ తీర్మానాన్ని కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని ప్రతిపక్ష UDF (United Democratic Front) ఆమోదించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని స్పీకర్ ఏఎన్ శ్యాంసీర్ ప్రకటించారు.

రాష్ట్రాన్ని మలయాళంలో 'కేరళం' అని పిలుస్తారని.. ఇతర భాషల్లో కేరళ అని పిలుస్తార‌ని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మన రాష్ట్రం కేరళ పేరు ఉందని విజయన్ అన్నారు. మలయాళం మాట్లాడే వర్గాల కోసం ఐక్య కేరళ ఆవశ్యకత జాతీయ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి బలంగా ఉద్భవించిందని అన్నారు.

Updated On 9 Aug 2023 7:34 AM GMT
Ehatv

Ehatv

Next Story