Arvind Kejriwal : రెండు కోట్ల మంది తరుపున మీకు కృతజ్ఞతలు
కాంగ్రెస్(congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul gandhi), మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్‌లకు(Dr. Manmohan Singh) కృతజ్ఞతలు తెలుపుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) బుధవారం లేఖ రాశారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.

ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సభలో ఆమోదించిన తర్వాత కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ బిల్లును బ్లాక్ బిల్‌గా పేర్కొన్న ఆయన.. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ముగ్గురు నేతలకు వేర్వేరుగా లేఖలు రాసి రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజల తరపున కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ ప్రజల రాజ్యాంగ ప్రయోజనాలను పరిరక్షించేందుకు పార్లమెంట్‌లో మద్దతిచ్చిన మిమ్మల్ని నేను నా ప్రజల తరుపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రాజ్యాంగ సూత్రాలను పరిరక్షించడంలో మీ నిబద్ధత దశాబ్దాలుగా గుర్తుండిపోతుందని ఆశిస్తున్నాను. రాజ్యాంగాన్ని అణగదొక్కే వారిపై జరుగుతున్న పోరాటంలో మేము మీకు అండగా ఉంటామని లేఖలో పేర్కొన్నారు.