ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ల వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సర్టిఫికెట్లు చూపించమని అడిగిన పాపానికి ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM)పై పాతిక వేల రూపాయల జరిమానా కూడా విధించింది గుజరాత్ హై కోర్టు(Gujarat High Court). నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను చూపించాల్సిన అవసరం ప్రధానమంత్రి కార్యాలయానికి లేదని తీర్పు చెప్పింది. దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి.
ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ల వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సర్టిఫికెట్లు చూపించమని అడిగిన పాపానికి ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM)పై పాతిక వేల రూపాయల జరిమానా కూడా విధించింది గుజరాత్ హై కోర్టు(Gujarat High Court). నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను చూపించాల్సిన అవసరం ప్రధానమంత్రి కార్యాలయానికి లేదని తీర్పు చెప్పింది. దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేదు. ప్రధాని మోదీ డిగ్రీల అంశాన్ని మరోసారి లేవనెత్తింది. ప్రధాని డిగ్రీలపై విచారణ జరిపితే అవి అసలైనవో, నకిలీవో తేలిపోతుందని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్(sanjaysinh) అన్నారు. మోదీ డిగ్రీ సర్టిఫికెట్(PM Modi Degree Certificate) ఫేక్ అని చాలా సంఘటనలు రుజువు చేశాయన్నారు. ఒకవేళ సర్టిఫికెట్ ఫేక్ అని తేలితే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మోదీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు భవిష్యత్తు ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతాడు అని సంజయ్ సింగ్ వివరించారు.
నిజానికి 2016లోనే మోదీ డిగ్రీపై అనేక అనుమానాలు వచ్చాయి. ఆరోపణలూ వెల్లువెత్తాయి. దాంతో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ సర్టిఫికెట్ చూపించారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఎంటైర్ పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో మోదీ ఎంఏ పూర్తి చేసినట్టు ఆ సర్టిఫికెట్‌లో ఉంది. ఇప్పుడా సర్టిఫికెట్‌ను సంజయ్ సింగ్ మళ్లీ విలేకరుల ముందు ప్రదర్శించారు. గుజరాత్ యూనివర్సిటీకి బదులుగా గుజరాత్ యూనిబర్సిటీ అని సర్టిఫికెట్‌లో ఉంది. ఈ సర్టిఫికెట్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని పేర్కొన్న ఫాంట్ 1992లో ఉనికిలోకి వచ్చింది. మరి 1983 నాటి సర్టిఫికెట్‌లో ఆ ఫాంట్ ఎలా వచ్చింది? అని సంజయ్ ప్రశ్నించారు. దీన్నిబట్టి అది ఫేక్ డాక్యుమెంట్ అని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. మోదీ ప్రధాని కాక ముందు గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సమయంలో మోదీ తాను పాఠశాల తర్వాత విద్యను కొనసాగించలేదని చెప్పారు. 2005లో ఆ స్టేట్‌మెంట్‌తోనే సెంటిమెంట్‌గా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది ఆయన 1979లో ఢిల్లీ విశ్వ విద్యాలయం నుంచి బీఏను, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏను ఎలా పూర్తి చేయగలిగారు అని సంజయ్ నిలదీశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా మోదీ డిగ్రీలపై సెటైర్లు వేశారు. డిగ్రీ లేని వ్యక్తికి దేశంలోనే అత్యున్నత ఉద్యోగం అని పరోక్షంగా మోదీపై విమర్శలు చేశారు. దేశంలో నిజమైన డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు రావని, డిగ్రీ లేని వారికి మాత్రం అత్యున్నత ఉద్యోగం ఉందని దెప్పిపొడిచారు కవిత. మరోవైపు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కూడా ఘాటుగానే విమర్శించారు. దేశంలో డిగ్రీ చదివిన ఎంతో మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారని, మోదీని డిగ్రీ సర్టిఫికెట్ చూపించమని అడిగినందుకు పాతిక వేలు ఫైన్ విధించారన్నారు. డిగ్రీ ఎక్కడ చదివారో చెప్పుకోవడానికి సిగ్గెందుకని ఆయన ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో అయితే మోదీ సర్టిఫికెట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీమ్స్‌తో మోదీని ఓ ఆట ఆడుకుంటున్నారు. చిన్నపాటి ప్యూన్ ఉద్యోగం చేసే వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ఉద్యోగం సంపాదించుకున్నాడేమోనన్న అనుమానం వస్తే కంప్లయింట్ చేస్తారు కదా! అధికారులు విచారణ జరుపుతారు కదా! మరి ప్రధాని ఉద్యోగంలో ఉన్న వ్యక్తి అధికారికంగా డిక్లేర్ చేసిన సర్టిఫికెట్ మీద అనుమానాలు వస్తే దాన్ని నివృత్తి చేసే బాధ్యత ఆయనపైన లేదా? సర్టిఫికెట్లు చూపించడానికి ఎందుకు జంకుతున్నట్టు? అన్న ప్రశ్నలు తామరతంపరగా వస్తున్నాయి. మీరు మీ అమ్మ దగ్గరకు వెళ్లడం మీ పర్సనల్ విషయం. కానీ దానికి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తారు. ఫోటోలు తీసి దేశమంతటా ప్రదర్శిస్తారు. గుహంలో ధ్యానం చేయడం కూడా మీ పర్సనల్ వ్యవహారం .. ఆ ఫోటోలు కూడా దేశమంతటా వెదజల్లుతారు. గుళ్లకో గోపురాలకో వెళ్లడం కూడా మీ వ్యక్తిగత విషయం. దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. మీరు పబ్లిక్ ఆఫీసులో ఉన్నారు కాబట్టి మీ డిగ్రీ సర్టిఫికెట్ పర్సనల్ కాదు. దాన్ని మాత్రం చూపించమంటే మాత్రం ఎక్కడలేని కోపాలు వస్తుంటాయి. కేసులు వేస్తారు. శిక్షలు విధిస్తారు. ఇదెక్కడి న్యాయం అని నెటిజన్లు అడుతున్నారు. మోదీ భక్తులు మాత్రం వితండవాదం చేస్తున్నారు. మోదీ సర్టిఫికెట్లు చూపిస్తే పాకిస్తాన్ అడ్వాంటేజీగా తీసుకుంటుందట! ఈ లాజిక్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఏమిటి వివాదం?
నరేంద్రమోదీ విద్యార్హతలపై ఎప్పట్నుంచో వివాదం నడుస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేసినట్టు చూపిస్తున్న సర్టిఫికెట్లు అసలైనవి కావని, నకిలీవన్న ఆరోపణలు అప్పడే వచ్చాయి. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు మోదీ విద్యార్హతలపై విమర్శలు చేయడం మొదలు పెట్టాయి. ఇక లాభం లేదనుకున్న బీజేపీ నేతలు 2016, మే 10న మోదీ సర్టిఫికెట్లను మీడియా ముందు ప్రదర్శించారు. అంతకు ముందే మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను బహిరంగపర్చాలంటూ అప్పటి ముఖ్య సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్‌కు అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. దీనికి స్పందించిన మాడభూషి శ్రీధర్ డిగ్రీలను చూపాలంటూ సమాచార కమషన్ ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను గుజరాత్ హైకోర్టులో సవాల్ చేసింది గుజరాత్ యూనివర్సిటీ. ప్రధానమంత్రి వ్యక్తిగత వివరాలను ఇవ్వడంలో ఎటువంటి ప్రజాప్రయోజనం లేదని వాదించింది. మోదీ డిగ్రీల విషయంలో దాచడానికి ఏమీలేదని, ఇప్పటికే ఆయన డిగ్రీలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని గుజరాత్ యూనివర్సిటీ తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగానే ఢిల్లీకి చెందిన న్యాయవాది మహ్మద్ ఇర్షద్ కూడా మోదీ డిగ్రీ వివరాలను ఆర్టీఐ ద్వారా కోరారు. కానీ ఆ వివరాలను వెల్లడించలేమంటూ ఢిల్లీ యూనివర్సిటీ తేల్చి చెప్పింది. 1978లో బీఏలో పాస్ అయిన వారి డేటా తమ దగ్గర లేదంది. రికార్డులను ఓ ఏడాది మాత్రమే స్టోర్ చేస్తామని, అందువల్ల ఆ డేటా ప్రస్తుతం తమ దగ్గర లేదని పేర్కొంది. దీంతో వివాదం మరింత పెద్దదయ్యింది.
నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను చూపించాల్సిన అవసరం ప్రధానమంత్రి కార్యాలయానికి లేదని గుజరాత్ హై కోర్టు తీర్పు చెప్పడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రధాని ఎంత వరకు చదువుకున్నారో తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు లేదా? అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. డిగ్రీలు చూపించమని అడిగిన వాళ్లకు ఫైన్ వేస్తారా? ఏం జరుగుతోంది? అని నిలదీస్తున్నారు.