జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయం(Kedarnath temple) తలుపులు రేపు అంటే మే 10వ తేదీన తెరుచుకోబోతున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కేదార్‌నాథ్‌ గుడి తలుపులు తెరుస్తారు.

జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయం(Kedarnath temple) తలుపులు రేపు అంటే మే 10వ తేదీన తెరుచుకోబోతున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కేదార్‌నాథ్‌ గుడి తలుపులు తెరుస్తారు. చార్‌ధామ్‌ యాత్రలో(char dham yatra) భాగంగా కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలను శుక్రవారం ఉదయం ఏడు గంటలకు తెరవనున్నట్టు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ఛైర్మన్‌ అజేంద్ర అజయ్‌ తెలిపారు. ఆలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో అందంగా అలంకరిస్తున్నారు. మహాశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. ఏటా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కేదార్‌నాథ్‌కు వస్తారు. పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. శీతాకాలంలో ఆలయాన్ని మూసేస్తారు. దాదాపు ఆరు నెలల పాటు ఆలయం మూసే ఉంటుంది. ఆ సమయంలో ఆలయాన్ని మంచు కప్పేస్తుంటుంది.

Updated On 9 May 2024 1:24 AM GMT
Ehatv

Ehatv

Next Story