బీఆర్‌ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) పార్టీ నేతలు హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR), సంతోష్ కుమార్‌లతో(Santhosh kumar) సమావేశమయ్యారు. నంది నగర్(Nandinagara) లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇంటి వద్ద కొనసాగుతున్న ఐటీ, ఈడీ సోదాలపై(ED,IT Raids) ఆరా తీశారు.
బీఆర్‌ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) పార్టీ నేతలు హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR), సంతోష్ కుమార్‌లతో(Santhosh kumar) సమావేశమయ్యారు. నంది నగర్(Nandinagara) లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇంటి వద్ద కొనసాగుతున్న ఐటీ, ఈడీ సోదాలపై(ED,IT Raids) ఆరా తీశారు. ఇక, హైదరాబాద్‌లో ఒకేసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) పర్యటన, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు జరగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కవిత రెండు ఫోన్లును ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర బలగాలు కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు.. సోదాలు జరుగుతున్న కవిత ఇంటికి ఆమె అడ్వకేట్ భరత్ చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.