KBC : కేబీసీలో కోటి ఎగరేసుకోపోయిన 14 ఏళ్ల బాలుడు
మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కేబీసీ(KBC) షోకు విశేష ప్రజాదరణ ఉంది. ఈ షోలో పాల్గొనాలని కోట్లాది మంది కోరుకుంటారు. ఇందులో పాల్గొని తమ సత్తా చాటాలని, భారీగా ప్రైజ్‌మనీ(Prize money) తీసుకెళ్లాలని చూస్తుంటారు. అయితే తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతిలో యువకెరటం ఎగిసింది. కోటి ఎగరేసుకొని పోయింది. కేబీసీ జూనియర్స్ స్పెషల్‌లో(Juniors special) హర్యానాలోని(Haryana) మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్(Mayanak) పాల్గొన్నాడు. మయాంక్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగవాళం జరిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్ చేసి కోటి రూపాయలను(One Crore) సొంతం చేసుకున్నాడు. ఈ బాలుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కేబీసీ(KBC) షోకు విశేష ప్రజాదరణ ఉంది. ఈ షోలో పాల్గొనాలని కోట్లాది మంది కోరుకుంటారు. ఇందులో పాల్గొని తమ సత్తా చాటాలని, భారీగా ప్రైజ్‌మనీ(Prize money) తీసుకెళ్లాలని చూస్తుంటారు. అయితే తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతిలో యువకెరటం ఎగిసింది. కోటి ఎగరేసుకొని పోయింది. కేబీసీ జూనియర్స్ స్పెషల్‌లో(Juniors special) హర్యానాలోని(Haryana) మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్(Mayank) పాల్గొన్నాడు. మయాంక్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగవాళం జరిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్ చేసి కోటి రూపాయలను(One Crore) సొంతం చేసుకున్నాడు. ఈ బాలుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మయాంక్ ఒక్క లైఫ్‌లైన్(Life line) కూడా వడుకోకుండా రూ.3.2 లక్షల వరకు సమాధానం చెప్పాడు. తర్వాత రూ.12.5 లక్షల ప్రశ్నకు ఓ లైఫ్‌లైన్ వాడుకున్నాడు. ఇక కోటి రూపాయల ప్రశ్న ఏంటంటే.. 'కొత్తగా కనుగొన్నఖండానికి అమెరికా(America) పేరు పెట్టి దాని మ్యాప్‌ను తయారుచేసిన యురోపియన్ క్యాటో గ్రాఫర్(European cartographer) ఎవరు అని అమితాబ్ మయాంక్‌ను కోరారు. ఇందుకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. A. అబ్రహం ఓర్టెలియస్, B. గెరడస్ మెరేక్టర్, C.జియోవన్నీ బాటిస్టా అగ్నెస్, D.మార్టిన్‌వాల్డీ ముల్లర్ అంటూ ఆప్షన్స్ ఇచ్చారు. దీంతో D.మార్టిన్ ముల్లర్(Martin Waldseemuller) ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. ఆప్షన్ D కరెక్ట్ కావడంతో కోటి రూపాయలను మయాంక్ గెలుచుకున్నాడు. కోటి రూపాయలను సొంతం చేసుకున్న తొలి జూనియర్ కంటెస్టెంట్‌గా(Contestant) మయాంక్ నిలిచాడు. ఆ తర్వాత 7 కోట్ల ప్రశ్నను ప్రయత్నించి షో నుంచి క్విట్(Quit) అయ్యాడు. దీంతో మయాంక్‌ను అమితాబ్ ప్రశంసించడమే కాకుండా.. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు. సోషల్ మీడియాలో(Social Media) జీనియస్ అంటూ మయాంక్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మయాంక్‌కు హర్యానా సీఎం మనోహర్‌లాల్(Manohar lal) శుభాకాంక్షలు చెప్పారు. అమితాబ్ ఎదుట కూర్చొని ఆన్సర్‌లు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని మయాంక్ అన్నాడు. ఈ షోలో పాల్గొనాలని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మయాంక్ కృతజ్ఞతలు చెప్పాడు