కశ్మీర్‌లో(Kashmir) కనిపించే వన్యప్రాణి రెడ్ స్టాగ్ జింకలపై(Redstag Deer) సెంటర్ ఫర్ సెల్యూలర్ అండి మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ ఓ పరిశోధనను వెల్లడించింది. ఈ అరుదైన జింకల జీవన విధానం, వాటి జనాభా, వాటి సంతానోత్పత్తిపై క్షుణ్ణంగా పరిశోధనలు చేసింది. సీనియర్ సైంటిస్ట్ డా.అనురాధారెడ్డి ఆధ్వర్యంలో ఈ అధ్యయనం కొనసాగింది. చినాబ్ నదీ(Chinab River) తీర ప్రాంతంలో ఎక్కువగా సంచరించేవిగా ఈ జింకలకు గుర్తింపు ఉంది.
కశ్మీర్‌లో(Kashmir) కనిపించే వన్యప్రాణి రెడ్ స్టాగ్ జింకలపై(Redstag Deer) సెంటర్ ఫర్ సెల్యూలర్ అండి మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ ఓ పరిశోధనను వెల్లడించింది. ఈ అరుదైన జింకల జీవన విధానం, వాటి జనాభా, వాటి సంతానోత్పత్తిపై క్షుణ్ణంగా పరిశోధనలు చేసింది. సీనియర్ సైంటిస్ట్ డా.అనురాధారెడ్డి ఆధ్వర్యంలో ఈ అధ్యయనం కొనసాగింది. చినాబ్ నదీ(Chinab River) తీర ప్రాంతంలో ఎక్కువగా సంచరించేవిగా ఈ జింకలకు గుర్తింపు ఉంది. వెదర్ సీజన్‌ను(Weather season) బట్టి ఇవి వలస(Migrat) వెళ్తుంటాయని.. ఈ జింకలు లోతట్టు, కొండ ప్రాంతాల్లోనే సంచరిస్తాయన్నారు. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా సంతానోత్పత్తి(Firtility) చేస్తుంటాయని.. సెప్టెంబర్- నవంబర్ మధ్యలో కూడా వీటి సంపర్కం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. జమ్ములోని(Jammu) దాచిగాం నేషనల్ పార్క్‌లో(Dachigam Natinal Park) ఈ జింకలను సంరక్షిస్తున్నారు. అయితే కాలక్రమేణ ఈ జింకల సంఖ్య తగ్గిపోతుందని ఈ పరిశోధన వెల్లడించింది. 1990లో వీటి సంఖ్య దాదాపు 5వేలకుపైగా ఉండేదని.. క్రమక్రమంగా అవి వాటి ఉనికిని కోల్పోతున్నాయని తెలిపింది. సంతానోత్పత్తికి ఉపయోగపడే మంగ జింకలు కేవలం 12 వరకే ఉన్నాయని ఈ స్టడీ తేల్చింది. 14 మైక్రోశాటిలైట్ మేకర్ల ద్వారా ఈ రెడ్‌స్టాగ్ మల వ్యర్థాలను పరిశీలించి.. వాటి సంఖ్యను, జన్యుక్రమాన్ని తేల్చారు. ఈ పరిశోధన రెడ్‌స్టాగ్ జింకల సంతానోత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుందని, ఇవి అంతరించిపోకుండా కాపాడుకోవచ్చని తెలిపింది. కేంబ్రిడ్జి ప్రెస్ జర్నల్ సీసీఎంబీ సైంటిస్టులు చేసిన పరిశోధనలను ప్రచురించడం విశేషం