దీపావళి పండుగ(Diwali festival) ఎప్పుడు జరుపుకోవాలన్న చర్చ మొదలయ్యింది.
దీపావళి పండుగ(Diwali festival) ఎప్పుడు జరుపుకోవాలన్న చర్చ మొదలయ్యింది. ప్రతీ సంవత్సరం ఏదో ఒక పండుగపై ఇలాంటి అనుమానాలు రావడం జరుగుతూ వస్తున్నది. ఈసారి దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే సందేహాలు వచ్చాయి. ఆ సందేహాలను నివృత్తి చేశారు కాశీ విద్వత్ కర్మకాండ పరిషత్‌కు(Kashivdwit Karmakanda Parishad) చెందిన పండితులు. దీపావళి తేదీపై వివిధ పంచాంగాలు గందరగోళం సృష్టించాయని, చాలా మంది రెండు తేదీలు సూచిస్తున్నారని పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య అశోక్ ద్వివేది అన్నారు. ఈ విషయంపై కాశీ పండితులు స్పష్టతనిచ్చారని చెప్పారు.అక్టోబరు 31వ తేదీన దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమావాస్య() తిథి అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమవుతుందని, నవంబర్ ఒకటిన సాయంత్రం 5:13 వరకు ఉంటుందని చెబుతూ అక్టోబర్ 31వ తేదీన రాత్రి అమావాస్య ఉంటుందని వివరించారు అశోక్ ద్వివేది. ధర్మసింధు, నిర్మాణ సింధుల ప్రకారం రాత్రి అమావాస్య ఉన్నరోజున అంటే అక్టోబర్ 31వ తేదీ రాత్రి లక్ష్మీపూజ, కాళీపూజలు చేసుకోవాలి. అలాగే దీపోత్సవాన్ని నిర్వహించుకోవాలి. అక్టోబరు 29న ధన్‌తేరస్, నరక చతుర్దశిని అక్టోబర్ 30 న చేసుకోవాలని అశోక్ ద్వివేది చెప్పుకొచ్చారు. కాశీకి చెందిన అన్ని పంచాంగాల ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న దీపావళి వేడుకలు చేసుకోవాలి.