మహాశివరాత్రి(Mahashiva ratri) పండుగ సందడి మొదలయ్యింది. శివాలయాలన్నీ విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్నాయి. మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కాశీ మహాదేవుడి కళ్యాణానికి ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Kashi Vishwanatha Temple
మహాశివరాత్రి(Mahashiva ratri) పండుగ సందడి మొదలయ్యింది. శివాలయాలన్నీ విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్నాయి. మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కాశీ మహాదేవుడి కళ్యాణానికి ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను భక్తులు తమ స్మార్ట్ ఫోన్‌లో లైవ్‌లో చూడవచ్చు. మార్చి 8వ తేదీన జరిగే మంగళహారతి నుంచి మార్చి 9వ తేదీన జరిగే భోగ్ హారతి(Bhog Harathi) వరకు మొత్తం 36 గంటలపాటు అన్ని సోషల్ మీడియా(Social media) ఫ్లాట్‌ఫారాలలో నాన్‌స్టాప్ లైవ్ టెలికాస్ట్(Live Telecast) చేయనుననట్టు కాశీ విశ్వనాథ దేవాలయం ట్రస్టు(Kashi Vishwanatha Temple Trust) ప్రకటించింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి 10 లక్షల మందికి పైగా భక్తులు రావచ్చని ట్రస్ట్ అంచనా వేస్తోంది. వికలాంగులు, వృద్ధులు సులభంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
