Thailand Lantern Festival : కార్తీక దీపారాధన మన దగ్గరే కాదు, థాయ్‌లాండ్‌లోనూ ఉంది!
భారతదేశంలోనే(India) కాదు. బౌద్ధాన్ని ఆచరించే చాలా దేశాల్లో దీపారాధన(lamp worship) ఉంది. శారదరాత్రుల పూజలున్నాయి. శరత్‌చంద్రజ్యోత్న్సలలో వేడుకలు చేసే ఆచారాలున్నాయి. కార్తీకపున్నమిలో దీపాలు వెలిగించి, ఆ దీపాలను ఆరాధించి నీళ్లలో వదిలే సంప్రదాయం ఉంది. మరీ ముఖ్యంగా థాయ్‌లాండ్ (thailand)లో కార్తీకపౌర్ణమి(karthika pournami) ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. సంధ్య చీకట్లు ముసురుకున్నాక నదీనదాలను, సరస్సులను, తటాకాలలో దీపాలను వదులుతారు. ఆకాశంలోని తారల ప్రతిబింబాలేమో అన్నట్టుగా ఉంటుందా దృశ్యం.
ఈ వేడుకను లోయ్ క్రతోంగ్ (loy krathong) అంటారు.

ఈ వేడుకను లోయ్ క్రతోంగ్ (loy krathong) అంటారు. సరిగ్గా కార్తీకమాసపు పున్నమి రాత్రే ఈ పండుగ జరుగుతుంది. థాయ్‌లాండ్‌లో ఇది ప్రధాన పండుగ. అక్కడ పురుషులు (men) కూడా దీపాలను నీళ్లలో వదులుతారు. ఇలా చేయడం వల్ల కష్టాలన్ని తీరతాయన్నది వారి నమ్మకం. ఇక యువతీయువకులైతే ఆకాశంలో లాంతర్ల (lantern festival)ను ఎగురవేస్తారు. పున్నమి వెలుగులతో పాటు ఈ లాంతర్ల కాంతులూ నిర్మలాకాశానికి నిగారింపు తెస్తాయి.
మనలాగే వారు కూడా అరటి దొప్పల్లో దీపాలను వదులుతారు. అవి దొరకకపోతే ఆకులతో దొప్పలు చేసి వాటిలో దీపాలు పెట్టి నీళ్లలో వదులుతారు. లోయ్ అంటే తేలియాడే తెప్ప అని అర్థం. క్రతోంగ్ (krathong)అంటే దీపం! ఇక దీపానికి ప్రత్యేకమైన అలంకరణ చేస్తారు. అందుకోసం రంగురంగుల పూలను సేకరిస్తారు. అలంకరణ పూర్తయ్యాక అగరొత్తులు వెలిగిస్తారు. అందరికంటే భిన్నంగా అందరిని ఆకట్టుకునే రీతిలో లోయ్‌క్రతోంగ్‌ను తీర్చిదిద్దిన వారికి ప్రత్యేక బహుమతులు కూడా ఇస్తారు.
బుద్ధభగవానుడిని (lord Buddha), నదీనదాలను పూజించడమే ఈ పండుగ పరమార్థం.. ఈ దీపోత్సవానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ రోజున ప్రతి ఇల్లూ దీపకాంతులతో వెలిగిపోతుంటుంది. ప్రతి ఆలయమూ (temple)దేదీప్యమానంగా శోభిల్లుతుంటుంది. రహదారులు, తోటలు, కార్యాలయాల భవనాలు ఒక్కటేమిటి సమస్తమూ లాంతర్లతో కాంతులీనుతుంటాయి. వెన్నెల కాంతులతో విద్యుద్దీపాలు పోటీపడతాయి..
అన్నింటికంటే ఆకట్టుకునే అంశం మరోటి ఉంది. అది క్రతోంగ్ పరేడ్ (katrong parade ). దీపాలతోనూ, రంగురంగుల పూలతో, రకరకాల దీపాలతో అలంకరించిన శకటాల ఊరేగింపే క్రతోంగ్ పరేడ్. శకటాల ముందు సంప్రదాయ నృత్యాలు, జనపదాల ఆలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అదనపు ఆకర్షణలు. థాయ్‌లాండ్‌లో సుప్రసిద్ధమైన వాట్‌ఫానతావో ఆలయం రంగురంగుల లాంతర్లతో అందంగా ముస్తాబవుతుంది.. అక్కడ జరిగే వేడుకలను తిలకించడానికి దేశదేశాల నుంచి పర్యాటకులు వస్తారు.. ఇదీ థాయ్‌లాండ్ కార్తీకపున్నమి వైభవం!