కార్తీక పౌర్ణమి(Karthika Pournami) నాడు వెలిగించే దీపం మన కోసం కాదు. లోకానికి మేలు చేసే ప్రతి ఒక్కరి బాగు కోసం వెలిగించే దీపం! మనలోని చీకట్లను తొలగించడానికి పెట్టిన దీపం.. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం సర్వ తమోపహమ్‌ అన్నారు.. మనో వికాసానికి, ఆనందానికి, సుఖ శాంతులకు, సద్గుణానికి దీపం ప్రతీక. అది మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. మనమంతా దీపారాధన(Lamp Worship) చేసేది అందుకే! మనమే కాదు. ప్రపంచంలో చాలా మంది కార్తీక పున్నమి రోజున దీపాలు(Lamp) వెలిగిస్తారు..

జైనులకు(Jains) ఇది అత్యంత పవిత్రమైన రోజు! శరద్‌ పున్నమి రోజున పాలిటానలోని(Palitana) జైన క్షేత్రానికి(Jain Kshetra) భక్తులు పోటెత్తుతారు. శత్రుంజయ కొండలపై ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి జైనులు వస్తారు. దాదాపు 216 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళతారు. ఈ యాత్రను శత్రుంజయ తీర్థయాత్ర(Shatrunjaya tirtha yatra) అంటారు. జైనుల మొదటి తీర్థంకరుడైన ఆదినాదను దర్శించి తరిస్తారు. జైనుల పంచక్షేత్రాలలో శత్రుంజయ పర్వతాలపై వెలిసిన ఈ క్షేత్రం కూడా ఒకటి! ఈ ప్రాంతంలో మొత్తం 863 ఆలయాలున్నాయి.

సిక్కులకూ(Sikhs) కార్తీక పౌర్ణమి విశేషమైనదే. సిక్కుల మత గురువు గురునానక్(Gurunanak) పుట్టినరోజు ఇది. మామూలుగానే విశిష్ట దినంగా భావించే కార్తీక పౌర్ణమి గురునానక్ జన్మదినం కూడా అవ్వడంతో పంజాబీలు(Punjabis) ఈ రోజును మహా పర్వదినంగా భావిస్తారు. గురునానక్ జయంతిని పంజాబీలు గురుపూరబ్‌గా పిల్చుకుంటారు. ఇక అమృత్‌సర్‌లోని(Amritsar) గోల్డెన్‌ టెంపుల్‌(Golden temple) అయితే విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. పవిత్ర గ్రంథం గురుగ్రంథ్‌ను సిక్కు గురువులు. భక్తులు ఆలయం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా బయటకు తీసుకొస్తారు. దీన్ని గురునానక్‌ ప్రకాశ్‌ ఉత్సవ్‌ అంటారు.

Updated On 26 Nov 2023 1:00 AM GMT
Ehatv

Ehatv

Next Story