ఒకప్పుడు తెలియని కొత్త ప్రాంతానికి నానా తిప్పలు పడి వెళ్లాల్సి వచ్చింది. పది మందిని అడ్రస్ అడిగితే కానీ అనుకున్న గమ్యానికి చేరుకోలేము. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు. ఎంచక్కా గూగుల్ మ్యాప్స్‌తో(Gogle Maps) ఈజీగా కొత్త ప్రదేశానికి వెళ్లవచ్చు. ఎలా వెళ్లాలో, ఎక్కెడెక్కడ మలుపులు తీసుకోవాలో, ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో, ఎంత సమయం పడుతుందో అన్ని చెప్పేస్తుంది గూగుల్ తల్లి.
ఒకప్పుడు తెలియని కొత్త ప్రాంతానికి నానా తిప్పలు పడి వెళ్లాల్సి వచ్చింది. పది మందిని అడ్రస్ అడిగితే కానీ అనుకున్న గమ్యానికి చేరుకోలేము. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు. ఎంచక్కా గూగుల్ మ్యాప్స్‌తో(Gogle Maps) ఈజీగా కొత్త ప్రదేశానికి వెళ్లవచ్చు. ఎలా వెళ్లాలో, ఎక్కెడెక్కడ మలుపులు తీసుకోవాలో, ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో, ఎంత సమయం పడుతుందో అన్ని చెప్పేస్తుంది గూగుల్ తల్లి. అయితే అన్నిసార్లు ఇది సరైన దారిని చూపిస్తుందని అనుకోలేం. కొన్నిసార్లు తప్పుదోవ కూడా పట్టిస్తుంటుంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్న ఫోటో. కర్ణాటకలోని(Karnataka) కొడగు జిల్లాలో స్థానికులు గూగుల్ నావిగేషన్(Google navigation) పొరపాటును గుర్తించారు. తమలాగే మరొకరు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాత్కాలిక సైన్ బోర్డును(Sign board) ఏర్పాటు చేశారు. 'ఇది మహీంద్రా రిసార్ట్‌కు వెళ్లే దారి కాదు, గుగూల్ నావిగేషన్ అనుసరించకండి. అక్కడికి వెళ్లేందుకు మరో మార్గాన్ని ఎంచుకోండి' అని సైన్‌బోర్డులో ప్రయాణికులను హెచ్చరించార. దీనికి సంబంధించిన ఫోటోను కొడగు కనెక్ట్ అనే పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది.