కర్నాటకలోని(Karnataka) రాయచూరులో(Rayachur) దారుణ సంఘటన జరిగింది.
కర్నాటకలోని(Karnataka) రాయచూరులో(Rayachur) దారుణ సంఘటన జరిగింది. భర్త అశ్లీల పనులు నచ్చక భార్య అతడిని హత్య(Murder) చేసింది. ఈ నెల 9వ తేదీన బెళగావి మహంతేష్ నగరలో ఉంటున్న 47 ఏళ్ల సంతోష్ పద్మణ్ణవర్ అనే పారిశ్రామికవేత్త గుండెపోటుతో చనిపోయాడు. అలాగని ఆయన భార్య ఉమ పద్మణ్ణవర్ చెప్పింది. అలా చెప్పి అంత్యక్రియలు కూడా జరిపించింది. పైగా భర్త కళ్లను దానం(Eye donation) కూడా చేసింది. బెంగళూరులో చదువుకుంటున్న ఆ దంపతుల కూతురు సంజన ఇంటికి వచ్చింది. తండ్రి మరణం వెనుక ఏదో జరిగే ఉంటుందని అనుమానపడింది. ఆ అనుమానంతోనే మూడు రోజుల కిందట మాళమారుతి పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. వారికి దిగ్భ్రాంతి కలిగించే విషయాలు తెలిశాయి. సంతోష్ పద్మణ్ణవర్ తరచూ అమ్మాయిలను ఇంటికి తెచ్చుకుని వారితో శృంగారం చేసేవాడు. ఇంట్లో భార్య ముందే వారితో నగ్నంగా తిరిగేవాడు. ఇంటి సీసీ కెమెరాల 13 హార్డ్ డిస్కులను, రికార్డర్లను పోలీసులు తనిఖీ చేస్తే అవే దృశ్యాలు కనిపించాయి. భార్య మట్టుకు ఈ వికృత చేష్టలను ఎన్నాళ్లని భరిస్తుంది? ఆమెకు విరక్తి పుట్టింది. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ శోభిత్ గౌడ (31), పవన్ (35)కు ఈ విషయం అంతా చెప్పింది. ముగ్గురూ కలిసి ప్లాన్ వేశారు. ముందు సంతోష్‌కు నిద్రమాత్రలు ఇచ్చారు. అతడు నిద్రలోకి జారుకోగానే దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. పోలీసులు ఉమను విచారించగా భర్త ప్రవర్తనను ఏకరువు పెట్టింది. తమ పిల్లల ముందు కూడా నగ్నంగా తిరిగేవాడని, ఇది తట్టుకోలేక తాను ఫేస్‌బుక్ మిత్రులతో కలసి భర్తను హత్య చేశామని నేరం అంగీకరించింది. ఆ కుటుంబం కథ విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆమె శోభిత్ గౌడతో క్లోజ్‌గా ఉండేదని పోలీసులు తెలుసుకున్నారు. సంతోష్ ఇంట్లో సీజ్ చేసిన హార్డ్ డిస్కుల్లో హతుడు సంతోష్ యువతులు, మహిళలతో ఉన్న ప్రైవేటు వీడియోలు అనేకం ఉన్నాయి. మహిళలతో గడుపుతూ మొబైల్‌తో వీడియోలు తీసుకునేవాడు. తరువాత వాటిని కంప్యూటర్‌లో భద్రపరిచేవాడు.