ఇదో చిత్రవిచిత్రమైన కథ. కథ కాదు, నిజంగా జరిగిన ఘటన. ఏ ఇల్లాలుకు ఇలాంటి దురవస్థ రాకూడదనిపించే విషాద సంఘటన ! కర్ణాటకలోని(Karnataka) రామనగర్‌లో(Ram nagar) నివసిస్తున్న లక్షణరావు ఓ కోడిమాంసం అమ్మే దుకాణంలో పని చేసేవాడు. 2015లో తల్లిదండ్రులు చూపించిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు.
ఇదో చిత్రవిచిత్రమైన కథ. కథ కాదు, నిజంగా జరిగిన ఘటన. ఏ ఇల్లాలుకు ఇలాంటి దురవస్థ రాకూడదనిపించే విషాద సంఘటన ! కర్ణాటకలోని(Karnataka) రామనగర్‌లో(Ram nagar) నివసిస్తున్న లక్షణరావు ఓ కోడిమాంసం అమ్మే దుకాణంలో పని చేసేవాడు. 2015లో తల్లిదండ్రులు చూపించిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లలోనే ఇద్దరు కుమారులకు తండ్రయ్యాడు. వచ్చే ఆదాయంతో భార్య పిల్లలను పోషించలేక అప్పులు(Debt) చేశాడు. వాటిని తీర్చేదారి లేక 2017లో భార్య పిల్లలను వదిలేసి ఇంటి నుంచి పారిపోయాడు. భర్త(Husband) కోసం వెతికింది. అతడి జాడ కనిపించకపోయేసరికి ఐజూరు పోలీసుస్టేషన్‌లో కంప్లయింట్ కూడా ఇచ్చింది. తల్లిదండ్రుల సాయంతో పిల్లలను పోషించుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఇటీవల ఆమె కన్నడ బిగ్‌బాస్ రియాల్టీ షో(Bigg Boss) చూసింది. అందులో ఓ వ్యక్తిని చూసే సరికి అనుమానం వచ్చింది.
తన భర్త పోలికలు కనిపించడంతో యూ ట్యూబ్‌లో మరోసారి ఆ షోకు సంబంధించిన వీడియోలను పరిశీలించింది. హిజ్రా(Transgender) రూపంలో ఉన్నది తన భర్తే అని గుర్తించింది. వెంటనే ఐజూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నడ బిగ్‌బాస్ రియాల్టీ షోలో నీతూ వనజాక్షి(Neetu Vanajakshi) అనే హిజ్రా పార్టిసిపేట్ చేసింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమెకు మైసూరులో థార్డ్ జెండర్ యూనియన్ స్వాగతం పలికింది. సత్కారం చేసింది. రష్మిక అనే హిజ్రా తీసిన రీల్స్‌లో కూడా లక్ష్మణ్ పోలికలతో ఉన్న హిజ్రా ఉంది. ఆ వీడియోలతో పోలీసులను సంప్రదించింది. పోలీసులు రష్మికను పిలిపించారు. వీడియోలో ఉన్నది ఎవరో చెప్పమన్నారు. ఆమె పేరు విజయలక్ష్మి అనే రష్మిక చెప్పింది. అడ్రస్ కూడా చెప్పింది. పోలీసులు విజయలక్ష్మిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. తాను లక్ష్మణరావును కాదని, తన పేరు విజయలక్ష్మి అని పోలీసులకు చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి తాను లక్ష్మణరావునేనని అంగీకరించాడు. లింగమార్పిడిచేయించుకున్నానని చెప్పాడు. భర్త ఆ మాట చెప్పేసరికి భార్య మూర్ఛపోయింది. భార్య,బిడ్డలను వదిలేసి వెళ్లడానికి మనసెలా ఒప్పిందని పోలీసులు అడిగితే, తనకు కుటుంబం కంటే హిజ్రా జీవితమే బాగుందని చెప్పాడు. మిస్సింగ్ కేసు సాల్వ్ అవ్వడంతో పోలీసులు లక్ష్మణరావు దగ్గర్నంచి ఓ రాతపూర్వక పత్రాన్ని తీసుకుని వదిలేశారు. అతడి భార్యను ఆసుపత్రిలో చేర్పించారు.