ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం. అలాగే కర్ణాటకలోని(Karnataka) తులునాడు(Thulunadu) ప్రాంతం వారిది చాలా భిన్నమైన విశ్వాసం. అక్కడ ప్రేతాత్మలకు పెళ్లిళ్లు(Ghosts Marriage) జరుగుతాయి. ఇందుకు చక్కటి ఉదాహరణ పుత్తూరులోని ఓ కుటుంబపెద్దలు ఇచ్చిన పత్రికా ప్రకటనే! ఆసక్తికరంగా ఉన్న ఆ ప్రకటనలో 30 ఏళ్ల కిందట మరణించిన తమ కూతురుకు తగిన ప్రేతాత్మ వరుడు కావాలని కోరారు.
ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం. అలాగే కర్ణాటకలోని(Karnataka) తులునాడు(Thulunadu) ప్రాంతం వారిది చాలా భిన్నమైన విశ్వాసం. అక్కడ ప్రేతాత్మలకు పెళ్లిళ్లు(Ghosts Marriage) జరుగుతాయి. ఇందుకు చక్కటి ఉదాహరణ పుత్తూరులోని ఓ కుటుంబపెద్దలు ఇచ్చిన పత్రికా ప్రకటనే! ఆసక్తికరంగా ఉన్న ఆ ప్రకటనలో 30 ఏళ్ల కిందట మరణించిన తమ కూతురుకు తగిన ప్రేతాత్మ వరుడు కావాలని కోరారు. ఆ ప్రకటనలో ఇంకా ఏమున్నదంటే 'కులల్ కులం(Kulal Kulam), బంగే రా గోత్రంలో జన్మించిన వధువుకు తగిన వరుడు కావలెను. వధువు 30 ఏళ్ల కిందట చనిపోయింది ఇదే కులం, వేరొక గోత్రంలో జన్మించి, 30 ఏళ్ల క్రితం మరణించిన వరుడు ఉన్నట్లయితే, ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన కుటుంబ సభ్యులు సమ్మతిస్తే సంప్రదించగలరు' అని పేర్కొన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబరును కూడా ఇచ్చారు. చిత్రమేమిటంటే ఈ ప్రకటనకు దాదాపు 50 మంది వరకు రియాక్టవ్వడం. ఈ విషయాన్ని వధువు కుటుంబ పెద్దనే చెప్పుకొచ్చారు. ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో మరణించినవారి ఆత్మలకు వివాహం చేసే ఆచారం ఉంది. జీవించి ఉన్నవారికి పెండ్లి చేసినట్లుగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తారు.