సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సూద్ కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మే 25న ఆయన బాధ్యతలు స్వీకరించవచ్చు. సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీకాలం మే 25తో ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ప్రవీణ్ సూద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రవీణ్ సూద్ మూడేళ్ల క్రితమే రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.

Karnataka top cop Praveen Sood appointed new CBI Director for a period of 2 years
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్(Praveen Sood) నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సూద్ కర్ణాటక కేడర్(Karnataka cadre)కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మే 25న ఆయన బాధ్యతలు స్వీకరించవచ్చు. సుబోధ్ కుమార్ జైస్వాల్(Subodh Kumar Jaiswal) పదవీకాలం మే 25తో ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ప్రవీణ్ సూద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రవీణ్ సూద్ మూడేళ్ల క్రితమే రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ప్రవీణ్ సూద్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. ప్రవీణ్ సూద్ మే 2024లో పదవీ విరమణ చేయవలసి ఉండగా.. తాజా నియామకంతో మే 2025 వరకు పదవిలో కొనసాగనున్నారు.
కర్ణాటక కేడర్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ 2004లో మైసూర్ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్)గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన బళ్లారి, రాయచూర్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేశాడు. కర్ణాటక హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు.
భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) మద్దతిస్తున్నారని ప్రవీణ్ సూద్‌పై ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి సూద్ మద్దతిస్తున్నారని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(DK Shivakumar) ఆరోపించారు. దీంతో ఆయన కొంతకాలం కిందట పతాక శీర్షికల్లోకి వచ్చారు. లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ ప్రవీణ్ సూద్ బీజేపీ(BJP) నేతలను రక్షిస్తున్నారని శివకుమార్ ఈ ఏడాది మార్చి 15న ఆరోపణలు చేశారు. ప్రవీణ్ సూద్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయనను అరెస్ట్ చేయాలని శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకే ప్రవీణ్ సూద్ నియామకం జరిగిందనేది రాజకీయ వర్గాల వాదన. నూతన సీబీఐ(CBI) డైరెక్టర్ వల్ల కర్ణాటక కాంగ్రెస్(Congress) శ్రేణులు భవిష్యత్‌లో ఎన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందో చూడాలి మరి.
