కర్ణాటక ప్రభుత్వ ఉచిత బియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వడానికి నిరాకరించడంతో.. 5 కిలోల బియ్యం బదులు రూ.170 చెల్లిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ‘‘ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు జూలై 1 నుంచి ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం ఉచితంగా అందజేస్తామని’’ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొద్ది రోజుల క్రితం ప్రకటించారు.

కర్ణాటక ప్రభుత్వ(Karnataka Govt) ఉచిత బియ్యం(Free Rice) పథకానికి కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వడానికి నిరాకరించడంతో.. 5 కిలోల బియ్యం బదులు రూ.170 చెల్లిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి(Karnataka) సిద్ధరామయ్య(CM Siddaramaiah) ప్రకటించారు. ‘‘ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు జూలై 1 నుంచి ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం ఉచితంగా అందజేస్తామని’’ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అదనంగా బియ్యం అందించాలని భారత ఆహార సంస్థ(FCI)కు లేఖ రాశారు. దీనికి తొలుత అంగీకరించిన ఫుడ్ కార్పొరేషన్.. ఆ తర్వాత బహిరంగ మార్కెట్ లో బియ్యాన్ని సరఫరా చేయలేమని బదులిచ్చింది.

దీంతో కాంగ్రెస్ సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై నిరసనకు దిగారు. కాగా, సిద్ధరామయ్య ఢిల్లీ(Delhi) వెళ్లి బియ్యం విషయంలో రాజకీయం చేయవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)ను కోరారు. అయితే కర్ణాటక డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. తెలంగాణ(Telangana), పంజాబ్(Punjab) రాష్ట్రాల నుంచి బియ్యం సేకరించేందుకు సిద్ధరామయ్య చర్చలు కూడా జరిపారు. బియ్యం వెంటనే అందుబాటులోకి రావడంలో సమస్య ఏర్పడింది. దీంతో జులై 1న ఉచిత బియ్యం పథకాన్ని ప్రారంభించడం కష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలో సిద్ధరామయ్య నిన్న కర్ణాటక ఆహార మంత్రి కేహెచ్ మునియప్ప(KH Muniyappa), హోంమంత్రి పరమేశ్వర(Home Minister Parameshwara), ఇతర ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. స‌మావేశంలో ప్రజలకు బియ్యం బదులుగా డబ్బు ఇవ్వాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ఉచిత బియ్యం అందించే 'అన్నభాగ్య‌'(Anna Bhagya) పథకానికి బియ్యాన్ని సేకరించడానికి మేము వివిధ మార్గాల్లో ప్రయత్నించాము. కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక చర్యతో బియ్యం కొనుగోళ్లు జరగలేదు. అయితే, ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాం. దీని ప్రకారం 5 కిలోల బియ్యం ఉచితంగా అందించనున్నారు. మిగిలిన 5 కిలోల బియ్యానికి కిలో రూ.34 చొప్పున నెలకు రూ.170 చెల్లిస్తారు. బియ్యాన్ని కొనుగోలు చేసేంత వరకు నగదు రూపంలో చెల్లించన‌ట్లు తెలిపారు. ఈ డబ్బు ప్రతినెలా కుటుంబ కార్డుదారులకు నేరుగా బ్యాంకులో జమ అవుతుందని అన్నారు.

Updated On 28 Jun 2023 11:08 PM GMT
Yagnik

Yagnik

Next Story