దొడ్డలహళ్లి కంపెగౌడ శివకుమార్‌(DK Shiva kummar)..షార్ట్‌కట్‌లో చెప్పాలంటే డీకే శివకుమార్‌. ఇప్పుడీ పేరు దేశమంతటా మారుమోగిపోతోంది. కర్ణాటక(Karnatka) కాంగ్రెస్‌(Congress) చీఫ్‌గా ఉన్న డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి(Cheif Minister) పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

దొడ్డలహళ్లి కంపెగౌడ శివకుమార్‌(DK Shiva kummar)..షార్ట్‌కట్‌లో చెప్పాలంటే డీకే శివకుమార్‌. ఇప్పుడీ పేరు దేశమంతటా మారుమోగిపోతోంది. కర్ణాటక(Karnatka) కాంగ్రెస్‌(Congress) చీఫ్‌గా ఉన్న డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి(Cheif Minister) పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి మొన్నటి విజయంలో డీకే శివకుమార్‌ది కీలక పాత్ర! పార్టీ విజయానికి అహర్నిశమూ కష్టపడ్డారు. ఒక్కలిగ సామాజికవర్గానికి చెందిన డీకే శివకుమార్‌ బలమైన రాజకీయ నాయకులలో ఒకరు. కర్ణాటకలో లింగాయతుల తర్వాత బలమైన సామాజికవర్గం ఒక్కలిగులే! వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. విద్యార్థి దశ నుంచే శివకుమార్‌ రాజకీయాల్లో అడుగుపెట్టారు.
1962లో కనకపురలో జన్మించిన డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం అయిన నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియాలో యాక్టివ్‌గా పని చేశారు. అప్పుడే రాజకీయాలలో ఓనమాలు నేర్చుకున్నారు. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు డీకే వయసు 27 ఏళ్లు.
ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా(MLA) గెలిచారు. సాతనూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు శాసనసభలో అడుగుపెట్టిన శివకుమార్‌ తర్వాత కనకపుర నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచారు. 1999 ఎన్నికల్లో జేడీ (ఎస్‌) పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామిపై గెలవడం గొప్ప విశేషం. సిద్ధరామయ్య ప్రభుత్వంలో విద్యుత్‌ శాఖ మంత్రిగా పని చేసిన డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌-జేడీ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో నీటి పారుదలశాఖ మంత్రిగా వ్యవహరించారు. కర్ణాటక స్టేట్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో ఎంఎ చేసిన డీకేకు రాజకీయాలలో అపార అనుభవం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు కష్టాల్లో పడినా ఆదుకునేది శివకుమారే! అందుకే ఈయనను ట్రబుల్‌ షూటర్‌గా పిలుచుకుంటారు.

2002లో మహారాష్ట్రలోని విలాస్ రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం కష్టాల్లో పడితే ఆదుకున్నది డీకే శివకుమారే! డీకే సాయంతోనే అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేయగలిగారు. ఆనాడు సుమారు 40 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి అవిశ్వాస తీర్మానంలో ఎన్నిక జరిగే రోజు వరకు రిసార్ట్స్‌లో ఉంచారు డీకే శివకుమార్‌. ఆ విధంగా ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగారు. విలాస్‌రావు ప్రభుత్వాన్ని గట్టెక్కించగలిగారు. డీకేనే లేకపోయి ఉంటే విలాస్‌రావు ప్రభుత్వం పడిపోయేదేమో! అలాగే 2017లోనూ కాంగ్రెస్‌కు డీకే అవసరం పడింది. గుజరాత్ నుంచి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావడానికి డీకే పడిన శ్రమ అంతా ఇంతా కాదు! కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీవైపు వెళ్లకుండా చూసింది శివకుమారే! సుమారు 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు శివారులోని రిసార్టులో ఉంచారు.

డీకే శివకుమార్‌ మీద అవినీతి ఆరోపణలు చాలానే ఉన్నాయి. మనీలాండరింగ్‌ కేసులు కూడా ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సీబీఐ విచారణ కూడా చేపట్టింది. 2017లో 34 కోట్ల రూపాయల పన్నులు ఎగవేసినట్టు డీకే మీద ఆరోపణలు వచ్చాయి. 2019 సెప్టెంబరులో మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. సుమారు నెల తరువాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. డీకే అరెస్ట్‌ను బీజేపీకి చెందిన యడియూరప్ప, శ్రీరాములు వంటి వారు కూడా ఖండించడం విశేషం. డీకేను అక్రమంగా అరెస్ట్‌ చేసినట్టు కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆ సమయంలో డీకేకు మద్దతుగా సోనియాగాంధీ నిలబడ్డారు. ధనవంతుడైన డీకేపై ఆరోపణలు రావడం సహజం! కర్ణాటక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో 14 వందల కోట్ల రూపాయల ఆస్తులను డీకే శివకుమార్ ప్రకటించారు. 2018లో ఆయన ఆస్తుల విలువ 840 కోట్ల రూపాయలు. ఆయనకు రియల్ ఎస్టేట్, షేర్ల్ మార్కెట్‌లో పెట్టుబడులు, లీజులు, వ్యవసాయం వంటి మార్గాల ద్వారా ఆదాయం వస్తున్నది. ఈ విషయాన్నే అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Updated On 16 May 2023 11:09 PM GMT
Ehatv

Ehatv

Next Story