కర్ణాటక రాజకీయాలు(Karnataka Politics) బాగా వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)కు కౌంట్‌డౌన్‌ మొదలవ్వడంతో పార్టీలు ప్రచారంలో బీజీ అయ్యాయి. అభ్యర్థుల ప్రకటనల తర్వాత ఏర్పడిన అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాయి. అధిష్టానాలపై అలకబూనిన నేతలు ఏ పార్టీలోకి వెళతారో తెలియడం లేదు. ఈ దోబూచులాట కొనసాగుతూనే ఉంది. బీజేపీ(BJP) ప్రకటించిన జాబితాలో పేర్లు లేనివారు ఇతర పార్టీలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.

కర్ణాటక రాజకీయాలు(Karnataka Politics) బాగా వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)కు కౌంట్‌డౌన్‌ మొదలవ్వడంతో పార్టీలు ప్రచారంలో బీజీ అయ్యాయి. అభ్యర్థుల ప్రకటనల తర్వాత ఏర్పడిన అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాయి. అధిష్టానాలపై అలకబూనిన నేతలు ఏ పార్టీలోకి వెళతారో తెలియడం లేదు. ఈ దోబూచులాట కొనసాగుతూనే ఉంది. బీజేపీ(BJP) ప్రకటించిన జాబితాలో పేర్లు లేనివారు ఇతర పార్టీలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చింది. పర్యవసానంగా కొందరు సిట్టింగ్‌లకు, సీనియర్లకు టికెట్ దొరకలేదు. దీన్ని వారు అవమానంగా ఫీలవుతున్నారు. బీజేపీలో ఉంటే నలుగురు నానా రకాలుగా అనుకునే ప్రమాదం ఉందని వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్‌(Ex-CM Jagadish Shetter) వ్యవహారమే బీజేపీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్న జగదీశ్‌ తనకు హుబ్లీ-ధార్వాడ్(Hubli-Dharwad)సెంట్రల్‌ నియోజకవర్గం టికెట్‌ కావాలని అడిగారు. తన పేరు ప్రకటించేందుకు అధిష్టానానికి రెండు రోజుల గడువు కూడా ఇచ్చారు. ఆ గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రంలోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. తనకు టికెట్‌ ఇవ్వకపోతే మాత్రం అనుచరులతో సమావేశమయ్యి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తానని జగదీశ్‌ చెప్పారు. అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారంటే జగదీశ్‌ ఎంత బలమైన నాయకుడో అర్థం చేసుకోవచ్చు. 40 ఏళ్లుగా ఆయన క్రియాశీలక రాజకీయాలలో ఉంటున్నారు. షెట్టర్‌కు టికెట్‌ ఇవ్వకపోతే మాత్రం ఆ ప్రభావం దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాలపై ఉండే అవకాశం ఉంది. షెట్టర్‌ విషయంలో బీజేపీ అధినాయకత్వం కనబరుస్తున్న వైఖరికి నిరసనగా హుబ్లీ-ధార్వాడ్ సిటీ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉన్న 16 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు. ఇక, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్‌తో పాటు 12 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటివరకు 212 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో షెట్టర్‌ను తన సీటు వదులుకోవాలని ఇప్పటికే బీజేపీ హైకమాండ్‌ సూచించిందట.

Updated On 15 April 2023 5:13 AM GMT
Ehatv

Ehatv

Next Story