కులాలు, మతాల పాత్ర లేని కర్ణాటక రాజకీయాల(Karnataka Politics)ను ఊహించలేము. అందుకే ఎన్నికలు వస్తే పార్టీలన్నీ కులమతాల చుట్టూ తిరుగుతుంటాయి. కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తాయి. మతాలను దువ్వుతుంటాయి. బోల్డన్నీ హామీలు ఇస్తుంటాయి. కర్ణాటక రాజకీయాలలో లింగాయత్‌(Lingayatism), వొక్కలిగ(Vokkaligas), ఓబీసీ(OBC), ముస్లింలు(Muslims) ప్రధాన పాత్ర వహిస్తుంటారు. ఆ మాటకొస్తే ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే.

కులాలు, మతాల పాత్ర లేని కర్ణాటక రాజకీయాల(Karnataka Politics)ను ఊహించలేము. అందుకే ఎన్నికలు వస్తే పార్టీలన్నీ కులమతాల చుట్టూ తిరుగుతుంటాయి. కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తాయి. మతాలను దువ్వుతుంటాయి. బోల్డన్నీ హామీలు ఇస్తుంటాయి. కర్ణాటక రాజకీయాలలో లింగాయత్‌(Lingayatism), వొక్కలిగ(Vokkaligas), ఓబీసీ(OBC), ముస్లింలు(Muslims) ప్రధాన పాత్ర వహిస్తుంటారు. ఆ మాటకొస్తే ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే. ఇప్పుడు అధికార పక్షం బీజేపీ(BJP), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌(Congress), మరో విపక్షం జేడీ(ఎస్‌) వారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి. వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. లింగాయత్‌లను ఆకర్షించడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు తెగ ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఆ సామాజికవర్గం ఏ పక్షాన ఉంటుందన్నది ఇప్పటి వరకైతే సస్పెన్స్‌గానే ఉంది. ఇక జేడీ (ఎస్‌) ఎప్పటిలాగే వొక్కలిగ సామాజికవర్గాన్నే నమ్ముకుని ఉంది. లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా అంటే 15 శాతం ఓటర్లున్న వొక్కలిగలు కూడా అభ్యర్థుల గెలుపోటములలో కీలక పాత్ర పోషించనున్నారు.

వొక్కలిగలు మొదటి నుంచి జేడీ(ఎస్‌) వెనుకే ఉన్నారు. పాత మైసూరు ప్రాంతం(Old Mysore Region)లో ఉన్న 59 అసెంబ్లీ స్థానాలలో వీరిదే ప్రధానపాత్ర. ఇప్పటికీ వారు మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవెగౌడ(H. D. Deve Gowda)ను అమితంగా ఇష్టపడతారు. అందుకే జేడీ (ఎస్‌) గెలిచే స్థానాలలో అత్యధికం ఆ ప్రాంతం నుంచే ఉంటాయి. ఇది గ్రహించిన అధికార భారతీయ జనతా పార్టీ వొక్కలిగ ఓటు బ్యాంకును చీల్చేందుకు వ్యూహం పన్నింది. అందులో భాగంగానే కోటా రాజకీయాలకు తెర లేపింది. అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీ వ్యూహరచన చేసింది. 2018 ఎన్నికల్లో బీజేపీకి వందకు పైగా సీట్లు వచ్చాయి. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అవసరమైన స్థానాలను సంపాదించలేకపోయింది. జేడీ(ఎస్‌) బలంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో బీజేపీకి వచ్చినవి కేవలం ఆరు మాత్రమే. ఈసారి ఆ ప్రాంతంలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెల్చుకోవాలని బీజేపీ అనుకుంటోంది. ఎన్నికల వేళ ముస్లింలకు ఉన్న నాలుగుశాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. ఆ నాలుగు శాతాన్ని లింగాయత్‌, వొక్కలిగ సామాజికవర్గాలకు చెరో సగం పంచింది. ఈ నిర్ణయం తమకు లాభిస్తుందన్న నమ్మకంతో బీజేపీ ఉంది. ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి పెంచినందుకు ఆ సామాజికవర్గం కూడా తమవైపే ఉంటుందని బీజేపీ విశ్వసిస్తోంది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాలు లింగాయత్‌, దళితులతో ఏ మేరకు సంతృప్తినిచ్చిందో తెలియదు కానీ ముస్లింలు మాత్రం మండిపడుతున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత ఏర్పడింది. అంతర్గత రిజర్వేషన్లతో తమకు అన్యాయం జరుగుతుందన్నది బంజారాల భావన. పాత మైసూరులో ఉన్న 59 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ 41 స్థానాలలో వొక్కలిగలను బరిలో దింపింది. వొక్కలిగల ప్రధాన వృత్తి వ్యవసాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాల గురించి వారికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా( Amit Shah)లు ఎక్కువగా పాత మైసూరు ప్రాంతంలోనే పర్యటిస్తున్నారంటే బీజేపీ ఈ ప్రాంతాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నదో అర్థమవుతోంది.

లింగాయత్‌, బ్రాహ్మణుల ఓట్లతో పాటు హిందువుల ఓట్లు కూడా తమకే పడతాయని బీజేపీ బలంగా నమ్ముతోంది. హిందుత్వ, దేశభక్తి తమకు ఓట్లు తెచ్చిపెడతాయని అనుకుంటోంది. లింగాయత్‌లో బలమైన నేతగా పేరుపొందిన యడియూరప్ప సేవలను బీజేపీ బాగా వాడుకుంటోంది. లింగాయత్‌లు తమవైపే ఉన్నారని, వారికి 51 సీట్లు కేటాయించామని బీజేపీ చెబుతున్నదే కానీ లింగాయత్‌లో పేరు ప్రతిష్టలు కలిగిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవాది పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరడం కమలదళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. తాను తక్కువలో తక్కువగా పాతిక సీట్లలో బీజేపీ గెలుపు అవకాశాలకు గండి కొడతానని జగదీశ్‌ షెట్టర్‌ చేసిన ప్రతిన బీజేపీని బయపెడుతున్నది. వీరశైవ లింగాయత్‌లు ఇంతకు బీజేపీ వైపు ఉన్నారే కానీ, ఇప్పుడు తమకు మద్దతుగా నిలుస్తారని కాంగ్రెస్‌ చెబుతోంది. హిందూత్వకు పోటీగా అహిందా నినాదాన్ని ఎత్తుకున్నది. ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీల సపోర్ట్‌ తమకే ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఓబీసీలలో ఒకప్పడు కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారులుగా ఉన్న బిల్వాస్‌, మొగవీరాస్‌, విశ్వకర్మ, కొలిస్‌లు కొంతకాలంగా బీజేపీ వెంట నడుస్తున్నారు. ఈ ఎన్నికల్లో వీరు ఎటువైపు అన్నది ఆసక్తిగా మారింది. వీరు కాంగ్రెస్‌వైపుకు వెళ్లితే మాత్రం బీజేపీకి గడ్డుకాలమే!

Updated On 19 April 2023 12:24 AM GMT
Ehatv

Ehatv

Next Story