ప్రతి మనిషికి అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ఎన్నోరకాల బంధాలుంటాయి. అలాగే స్నేహ బంధం కూడా ఉంటుంది. మన వ్యక్తిగత విషయాలను స్నేహితులతో చెప్పుకుంటాం. సాదకబాధలు స్నేహితుడికి చెప్పుకొని సేదతీరుతుంటాం.
ప్రతి మనిషికి అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ఎన్నోరకాల బంధాలుంటాయి. అలాగే స్నేహ బంధం కూడా ఉంటుంది. మన వ్యక్తిగత విషయాలను స్నేహితులతో చెప్పుకుంటాం. సాదకబాధలు స్నేహితుడికి చెప్పుకొని సేదతీరుతుంటాం. రక్తసంబంధం లేకున్నా కానీ స్నేహబంధానికి విలువ ఇస్తుంటారు. కానీ స్నేహబంధంలో కూడా కొందరు పురుగులు ఉంటారనేది అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. మోసం చేసిన స్నేహితుల కథనాలు వింటూనే ఉంటాం. ఓ కామాంధుడు స్నేహితుడి భార్యపై కన్నేశాడు. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం(Extra marital affair) పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న స్నేహితుడి చేతిలో హత్యకు(Murder) గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు చూస్తే..
కర్నాటకలోని(Karnataka) శివమొగ్గా(Shivamogga) జిల్లాలో నలుగురు స్నేహితులు ఉన్నారు. కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు. కిరణ్(Kiran), అక్షయ్(Akshay), హేమంత్(Hemanth), మరి స్వామి(Mari Swamy) అనే నలుగురు స్నేహంగా పెరిగారు. ఈ క్రమంలో కిరణ్‌కు వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం బాగానే జరిగింది. ఆ తర్వాత కిరణ్ భార్యపై స్నేహితుడు మరి స్వామి కన్నేశాడు. మెల్లగా ఆమెను ముగ్గులోకి దించాడు. కిరణ్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కిరణ్ భార్యతో పారిపోవాని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఈ పాప కార్యక్రమంలో మరో స్నేహితుడు కూడా కిరణ్ కూడా పాల్గొన్నాడు. కిరణ్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంలో మరి స్వామికి అండగా నిలిచాడు. కొన్నాళ్ల తర్వాత కిరణ్‌కు అసలు విషయం తెలిసింది. దీంతో మరి స్వామిని చంపాలని కిరణ్ ప్లాన్ వేశాడు. ఇందుకుగాను మరో స్నేహితుడి అక్షయ్ సాయం తీసుకొని హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో కిరణ్, అక్షయ్‌ను పోలీసులు(Police arrest) అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై స్థానికులు ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. ఇలాంటి ఏకంగా స్నేహబంధంపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయని అనుకుంటున్నారు.