కర్ణాటకలోని(Karnataka) ఉడుపిలో(Udipi) నలుగురుని అమానుషంగా హత్య చేసిన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌(Praveen Kumar) చౌగలే సైకోలా ప్రవర్తించాడు. అంతమందిని చంపినప్పటికీ అతడిలో ఏ మాత్రం భయం, బెరుకు లేవు. బాధ కూడా లేదు. దీపావళి(Diwali) పండుగను ఉత్సాహంగా జరుపుకున్నాడు. పైగా ఆనందంగా టపాసులు(Crackers) కూడా కాల్చాడు. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో తేలాయి. ఈ నెల 12న దీపావళి పండుగ రోజు ఉదయం తల్లీ, ఇద్దరు కూతుళ్లు, కొడుకుని హత్య(Murder) చేశాడు.

కర్ణాటకలోని(Karnataka) ఉడుపిలో(Udipi) నలుగురుని అమానుషంగా హత్య చేసిన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ చౌగలే(Praveen Kumar Chowgule) సైకోలా ప్రవర్తించాడు. అంతమందిని చంపినప్పటికీ అతడిలో ఏ మాత్రం భయం, బెరుకు లేవు. బాధ కూడా లేదు. దీపావళి(Diwali) పండుగను ఉత్సాహంగా జరుపుకున్నాడు. పైగా ఆనందంగా టపాసులు(Crackers) కూడా కాల్చాడు. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో తేలాయి. ఈ నెల 12న దీపావళి పండుగ రోజు ఉదయం తల్లీ, ఇద్దరు కూతుళ్లు, కొడుకుని హత్య(Murder) చేశాడు. పోలీసులు నిందితున్ని కోర్టులో హాజరు పరిచి కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో ప్రవీణ్‌ కుమార్‌ అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. యువతి ప్రేమించడం లేదన్న ఏకైకా కారణంతో ఆ నలుగురిని పొట్టన పెట్టుకున్నాడు. ఇంట్లోనే వారిని చంపిన తర్వాత ఉడుపి బస్టాండ్‌కు(Bus Stand) వెళ్లాడు ప్రవీణ్‌. రెండుసార్లు బైకిస్టులను లిఫ్ట్‌ అడిగి కొంచెం దూరం వెళ్లిన ప్రవీణ్‌ తర్వాత ఆటోలో బస్టాండ్‌కు చేరుకున్నాడు. నలుగురిని హత్య చేస్తున్నప్పుడు పెనుగులాటలో చేతికి గాయం అయ్యింది. ఆ గాయానికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. తర్వాత ఫోన్‌ను స్విచాఫ్‌చేసి మంగళూరుకు వెళ్లాడు. అక్కడ తన కుటుంబంతో కలసి దీపావళి పండుగ జరుపుకున్నాడు. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లాడు. తర్వాత ఒక్కడే కారులో బెళగావికి చేరుకున్నాడు. అక్కడ తన మొబైల్‌ ఫోన్‌ను ఆన్‌ చేశాడు. ఉడుపి పోలీసులు ఇచ్చిన సూచనతో అలెర్టయిన బెళగావి జిల్లా కుడిచి పోలీసులు ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ప్రవీణ్‌ కుమార్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు.

Updated On 20 Nov 2023 1:05 AM GMT
Ehatv

Ehatv

Next Story