ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమే చేతుల్లోకి వచ్చి చేరింది. ఇంకేముంది చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇంటర్నెట్‌కు ఎడిక్టయిపోతున్నారు.
ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమే చేతుల్లోకి వచ్చి చేరింది. ఇంకేముంది చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇంటర్నెట్‌కు ఎడిక్టయిపోతున్నారు. కొందరు దానిని సద్వినియోగం చేసుకుంటుంటుటే మరికొందరు దానిని వివిధ రకాలుగా దుర్వినియోగం చేస్తుంటారు. చిన్నపిల్లల చేతిలో ఫోన్ పెడితే టీనేజ్‌లోనే పోర్న్ సైట్లకు అలవాటు పడిపోతున్నారు. హార్మోన్ల ప్రభావం(Harmones), ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్ట్ కావడంతో కామవాంఛలు(Sexual desires) ఎక్కువయిపోతున్నాయి. దీంతో కామం తలకెక్కి వావివరసలు మర్చిపోయి ఇంట్లో ఉన్న ఆడవారిని కూడా వదలడం లేదు కొందరు కురాళ్లు.
సరిగ్గా ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని దక్షిణ కన్నడ(South Kanada) జిల్లాలోని ఉప్పినంగడిలోని పేర్నే గ్రామంలో ఓ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బిలియూరులోని దర్ఖాసులో నివాసముంటున్న హేమావతి (37) ఆదివారం అర్థరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. అక్క కొడుకే ఆమె మృతికి కారణమయ్యాడని తెలియడంతో పోలీసులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. హేమావతి ఇంటి పదో తరగతి చదువుతున్న అక్క కొడుకు వెళ్లాడు. పిన్ని ఇంటికి వెళ్లిన అతడు.. ఆమె నిద్రపోయాక.. కామ కోరికలతో రగిలిపోతున్న అక్క కొడుకు హేమవతిని అసభ్యంగా తాకాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన పిన్ని 'ఏంటీ నువ్వు చేస్తున్న పని' అంటూ మందలించింది. వెళ్లి నిద్రపో అంటూ తిట్టినా పిన్నిని అత్యాచారం చేయబోయాడు. గట్టిగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ అతనిలో భయం మొదలైంది. తను చేసిన పని గురించి అమ్మానాన్నలకు చెప్తుందని భయపడ్డాడు. దీంతో నిద్రపోతున్న పిన్ని మంచంపైకి వెళ్లి ఊపిరాడకుండా మెడ గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికీ ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ క్రమంలో బాలుడి మొహంపై గాయాలయ్యాయి. అయినా వదలకుండా ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. ఆ తర్వాత పిన్ని గుండెపోటుతో చనిపోయిందని నమ్మించాడు. మృతురాలి మెడపై గాయాలు, బాలుడి మొహంపై రక్కిన గుర్తులు ఉండడంతో అతని తండ్రికే అనుమానం వచ్చింది. అనుమానాస్పదంగా మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలుడిని గట్టిగా ప్రశ్నించడంతో ఉన్న నిజం వెళ్ల గక్కాడు.