కర్నాటకలో(Karnataka) దారుణం చోటు చేసుకుంది. తాను పెళ్లి చేసుకోబోయే మైనర్‌ బాలిక(Minor girl) తల నరికేశాడో దుర్మార్గుడు. నిశ్చితార్థం రద్దుకావడంతో అతడు ఈ పాతకానికి పాల్పడ్డాడు. మడికేరిలోని 32 ఏళ్ల ప్రకాశ్‌ అనే వ్యక్తికి, 16 ఏళ్ల మీనా అనే అమ్మాయికి నిశ్చితార్థం జరగాల్సి వుండింది. ఆ అమ్మాయి రెండు రోజుల కిందటే పదో తరగతి పాసయ్యింది.

కర్నాటకలో(Karnataka) దారుణం చోటు చేసుకుంది. తాను పెళ్లి చేసుకోబోయే మైనర్‌ బాలిక(Minor girl) తల నరికేశాడో దుర్మార్గుడు. నిశ్చితార్థం రద్దుకావడంతో అతడు ఈ పాతకానికి పాల్పడ్డాడు. మడికేరిలోని 32 ఏళ్ల ప్రకాశ్‌ అనే వ్యక్తికి, 16 ఏళ్ల మీనా అనే అమ్మాయికి నిశ్చితార్థం జరగాల్సి వుండింది. ఆ అమ్మాయి రెండు రోజుల కిందటే పదో తరగతి పాసయ్యింది. ఎంగేజ్‌మెంట్‌కు(Engagement) ముందు ఆ బాలిక మైనర్‌ అంటూ చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌కు(child rights commission) ఫిర్యాదు వచ్చింది. దాంతో అధికారులు అక్కడికి వెళ్లి ఎంగేజ్‌మెంట్‌ను అడ్డుకున్నారు. అమ్మాయికి ఇంకా మైనారిటీ తీరలేదన, వయసు తక్కువగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోరాదని ఆ యువకుడికి నచ్చచెప్పారు. రెండు కుటుంబాలు ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నాయి. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ప్రకాశ్‌ అమ్మాయి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె తల్లిదండ్రులపై దాడికి దిగాడు. ఇంట్లో నుంచి అమ్మాయిని బ‌య‌ట‌కు లాగాడు. ఉన్మాదం తలకెక్కడంతో ఆమె త‌ల న‌రికివేశాడు. ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి ప‌రారీ అయ్యాడు. ప్రస్తుతం ప్రకాశ్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Updated On 10 May 2024 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story