భారతీయ శిక్షాస్మృతి (IPC)ని సవరించాలని లేదా మృతదేహాలపై అత్యాచారాన్ని నేరంగా పరిగణించి శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) కేంద్రాన్ని కోరింది. న్యాయమూర్తులు బి వీరప్ప(B.Veerappa), వెంకటేష్ నాయక్(Venkatesh Nayak) తో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ మే 30 న ఇచ్చిన తీర్పులో ఐపీసీ సెక్షన్ 376 కింద ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ సిఫార్సు చేసింది.

అత్యాచారానికి సంబంధించిన ఈ సెక్షన్‌లో.. మృతదేహంపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి శిక్ష విధించే నిబంధన లేదు. ఓ మహిళను హత్య చేసిన తర్వాత నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఐపీసీ సెక్షన్ 302 (Murder) కింద నిందితుడికి కఠిన జీవిత ఖైదు, రూ. 50,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

నిస్సందేహంగా నిందితుడు మృతదేహంపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని బెంచ్ పేర్కొంది. కానీ ఐపీఎస్‌ సెక్షన్ 375 లేదా 377 ప్రకారం దీనిని నేరంగా పరిగణించలేము. ఎందుకంటే ఈ సెక్షన్లలో మృతదేహాన్ని మనిషిగా లేదా వ్యక్తిగా పరిగణించలేము. కాబట్టి సెక్షన్ 376 ప్రకారం.. మృతదేహంపై లైంగిక దాడి శిక్షార్హమైన నేరం కాదని కోర్టు పేర్కొంది.

Updated On 1 Jun 2023 1:05 AM GMT
Ehatv

Ehatv

Next Story