కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఓ చిత్రమైన తీర్పునిచ్చింది. ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి పెరోల్‌ మంజూరు చేసింది. ఇందులో వింతేమిటట? అని అనుకోకండి.. పెరోల్‌ను మంజూరు చేసింది తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడానికి! ఈ సందర్భంగా న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఇతడిని పెరోల్‌పై విడుదల చేయడం అనివార్యం. లేకపోతే జీవితాంతం ఇతడు ప్రేమను కోల్పోతాడు. తన ప్రేయసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిస్తే ఇతడు భరించలేదు.

కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఓ చిత్రమైన తీర్పునిచ్చింది. ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి పెరోల్‌ మంజూరు చేసింది. ఇందులో వింతేమిటట? అని అనుకోకండి.. పెరోల్‌ను మంజూరు చేసింది తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడానికి! ఈ సందర్భంగా న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఇతడిని పెరోల్‌పై విడుదల చేయడం అనివార్యం. లేకపోతే జీవితాంతం ఇతడు ప్రేమను కోల్పోతాడు. తన ప్రేయసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిస్తే ఇతడు భరించలేదు. అందుకే ఎమర్జెన్సీ పెరోల్‌ వినతికి అంగీకరిస్తున్నాం' అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఆనంద్‌ అనే యువకుడికి ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. ఇతడి సత్ప్రవర్తన కారణంగా శిక్షను పదేళ్లకు తగ్గించారు. ప్రస్తుతం అతడు బెంగళూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పటికే ఆరేళ్ల శిక్షాకాలం పూర్తయ్యింది. మరో నాలుగేళ్లు జైలులో ఉండాల్సి ఉంది. ఆనంద్‌-నీతా అనే యువతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆనంద్‌ జైల్లో ఉండటంతో పెళ్లి కుదరలేదు. దీంతో తనకు వేరే వాళ్లతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు చూస్తున్నారని, ఆనంద్‍కు పెరోల్ మంజూరు చేస్తే అతడిని పెళ్లి చేసుకుంటానని నీతా కోర్టును ఆశ్రయించింది. ఆనంద్‌ తల్లి రత్నమ్మ కూడా నీతాకు సపోర్ట్‌గా నిలిచంది. ఇద్దరూ తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని కోర్టుకు తెలిపింది. ప్రేమ గురించి తెలుసుకున్న న్యాయస్థానం.. ఇద్దరు ఒక్కటి కావాలని పెరోల్‌ మంజూరు చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఆనంద్‌ను విడుదల చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. పెరోల్‌ గడువు ముగిసిన తర్వాత ఆనంద్‌ను తిరిగి జైలుకు తరలించేలా చూడాలని అధికారులను ఆదేశించింది. అయితే పెళ్లి చేసుకోవడానికి పెరోల్‌ మంజూరు చేసే రూలేమీ లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. అయితే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనను హైకోర్టు న్యాయవాది జస్టిస్‌ ఎం. నాగప్రసన్న ఒప్పుకోలేదు.

Updated On 6 April 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story