కర్ణాటక(Karnataka) మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సంగప్ప సవాది(*Lakshman Savadi) కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవలే ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. సమాచారం ప్రకారం.. లక్ష్మణ్ సంగప్ప బెల్గాం నుండి బెంగళూరుకు బయలుదేరబోతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) పేరిట సంగప్ప కోసం ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. బెంగళూరు(Banglore) చేరుకున్న తర్వాత కాంగ్రెస్(Congress) లో చేరుతార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోప‌క్క‌ జేడీఎస్‌(JDS)తో కూడా కలిసి వెళ్లవచ్చని చ‌ర్చ […]

కర్ణాటక(Karnataka) మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సంగప్ప సవాది(*Lakshman Savadi) కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవలే ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. సమాచారం ప్రకారం.. లక్ష్మణ్ సంగప్ప బెల్గాం నుండి బెంగళూరుకు బయలుదేరబోతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) పేరిట సంగప్ప కోసం ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. బెంగళూరు(Banglore) చేరుకున్న తర్వాత కాంగ్రెస్(Congress) లో చేరుతార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోప‌క్క‌ జేడీఎస్‌(JDS)తో కూడా కలిసి వెళ్లవచ్చని చ‌ర్చ జ‌రుగుతుంది. సంగప్ప అథని నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న నేప‌థ్యంలో.. సీటు హామీ ఇచ్చిన పార్టీలో చేరుతారా లేక ఏదో ఒక పార్టీలో చేరి మ‌రేదైనా ప‌ద‌వితో స‌రిపెట్టుకుంటారా అనేది తెలియాల్సివుంది.

అంతకుముందు.. లక్ష్మణ్ సంగప్పకు అథని నియోజకవర్గం నుండి టికెట్ నిరాకరించడంతో ఏప్రిల్ 12న శాసన మండలి సభ్యత్వానికి, బీజేపీ(BJP) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నేను నా నిర్ణయం తీసుకున్నాను. నేను ఆత్మగౌరవం ఉన్న రాజకీయ నాయకుడిని. నేను ఎవరి ప్రభావంతో పని చేయడం లేదని అన్నారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్పందిస్తూ.. ఆయనకు అన్నీ ఇచ్చాం. అతను ఎందుకు విచారంగా ఉన్నాడో నాకు తెలియదు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియదు. నేను అతనిని సంప్రదించడానికి నా వంతు ప్రయత్నం చేసాను.. కానీ అతనిని క‌ల‌వ‌లేక‌సోయాన‌ని అన్నారు.

Updated On 14 April 2023 12:10 AM GMT
Yagnik

Yagnik

Next Story