కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(Kumaraswamy)పై విద్యుత్‌ చౌర్యం కేసు నమోదయ్యింది. విద్యుత్ స్తంభం నుంచి అక్రమంగా కరెంట్‌ వినియోగించారని బెంగళూరు విద్యుత్తు సరఫరా సంస్థ (బెస్కాం) అధికారులు అంటున్నారు. దీపావళి సందర్భంగా బెంగళూరులోని తన ఇంటిని అలంకరించే క్రమంలో ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలను వేశారని చెబుతున్నారు.

కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(Kumaraswamy)పై విద్యుత్‌ చౌర్యం కేసు నమోదయ్యింది. విద్యుత్ స్తంభం నుంచి అక్రమంగా కరెంట్‌ వినియోగించారని బెంగళూరు విద్యుత్తు సరఫరా సంస్థ (బెస్కాం) అధికారులు అంటున్నారు. దీపావళి(Diwali) సందర్భంగా బెంగళూరులోని తన ఇంటిని అలంకరించే క్రమంలో ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలను వేశారని చెబుతున్నారు. దీనిపై మంగళవారం బెస్కాం ఏఈఈ ప్రశాంత్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో జయనగర పోలీసులు కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. ఇందులో తన తప్పేమీ లేదంటున్నారు కుమారస్వామి. తన ఇంటిని అలంకరించే బాధ్యతను ఓ ప్రైవేటు డెకొరేటర్‌కు అప్పగించామని, కేవలం టెస్టింగ్‌ కోసమే బయట నుంచి కరెంట్‌ తీసుకున్నారని కుమారస్వామి తెలిపారు. అందులోనూ ఆ టైమ్‌లో తాను ఇంట్లో లేనని వివరించారు. ఇంటికి వచ్చిన వెంటనే విషయం తెలుసుకుని ఇంట్లో మీటర్‌ నుంచి విద్యుత్తు వాడుకోవాలని చెప్పానని కుమారస్వామి క్లారిఫికేషన్‌ ఇచ్చుకున్నారు. ఇది అక్రమమని అధికారులు భావిస్తే తనకు నోటీసులు ఇవ్వవచ్చని, జరిమానా కట్టడానికి సిద్ధంగా ఉన్నానని కుమారస్వామి చెప్పారు. దేశం, రాష్ట్రం మునిగిపోయేంత పని తానేమీ చేయలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కుమారస్వామి హైదరాబాద్‌కు వచ్చి మరీ కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీ పథకాల గురించి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆయన ఈ మాట చెప్పిన మరుసటి రోజే కేసు నమోదు కావడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం కుమారస్వామిని ఓ ఆట ఆడుకుంటున్నారు. కుమారస్వామి కర్ణాటకలో కరెంట్‌ లేదని అంటున్నారని, కరెంటే లేకపోతే ఆయన ఎలా దొంగిలిస్తారని విమర్శిస్తున్నారు.

Updated On 15 Nov 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story