కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం వైద్యపరంగా నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం కుమారస్వామి అలసట, సాధారణ బలహీనత లక్షణాలతో ఏప్రిల్ 22న ఆసుపత్రిలో చేరారు.

కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం వైద్యపరంగా నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని బెంగళూరు(Bengaluru)లోని మణిపాల్ హాస్పిటల్(Manipal Hospital) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం కుమారస్వామి అలసట, సాధారణ బలహీనత లక్షణాలతో ఏప్రిల్ 22న ఆసుపత్రిలో చేరారు.

"కుమారస్వామి ఏప్రిల్ 22 సాయంత్రం పాత విమానాశ్రయం రోడ్ బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చేరారు. అలసట, సాధారణ బలహీనత లక్షణాలతో ఆయనను ఆసుప‌త్రిలో చేర్చారు. అన్ని వైద్య పరీక్షలు, చికిత్స నిర్వహించబడుతున్నాయి. ఆయ‌న‌ వైద్యపరంగా స్థిరంగా ఉన్నారు. కోలుకుంటున్నారు" అని మణిపాల్ హాస్పిటల్ విడుద‌ల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనను త్వరలో డిశ్చార్జ్ చేయవచ్చునని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలావుంటే.. వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు, ప్ర‌చార కార్య‌క్ర‌మాలతో కుమారస్వామి బిజీబిజీగా ఉండ‌టం వ‌ల‌న అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయన ఆదివారం నాటి తన కార్యక్రమాలనన్నింటినీ రద్దు చేసుకున్నారు.

Updated On 22 April 2023 11:12 PM GMT
Yagnik

Yagnik

Next Story