మే 10న కర్ణాటకలో(Karnataka) అసెంబ్లీ ఎన్నికలు(assembly elections) జరగనున్నాయి. పార్టీలు ముమ్మర ప్రచారంలో మునిగిపోయాయి. నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల వాతావరణం హీట్ ఎక్కింది. కాంగ్రెస్(congress), బీజేపీ(BJP), జేడీ(ఎస్) అధికారమే లక్ష్యంగా బలప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి.

Karnataka Elections Survey Results
మే 10న కర్ణాటకలో(Karnataka) అసెంబ్లీ ఎన్నికలు(assembly elections) జరగనున్నాయి. పార్టీలు ముమ్మర ప్రచారంలో మునిగిపోయాయి. నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల వాతావరణం హీట్ ఎక్కింది. కాంగ్రెస్(congress), బీజేపీ(BJP), జేడీ(ఎస్) అధికారమే లక్ష్యంగా బలప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. జేడీ(ఎస్) లోకల్ సెంటిమెంట్‌తో తమ స్థానాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం సీఎం కుర్చే లక్ష్యంగా తలపడుతున్నాయి. అయితే కర్ణాటక ఎన్నికలపై పోల్ సర్వేలు సంచలన ఫలితాలను వెల్లడించాయి. కాంగ్రెస్‌కు పట్టం కట్టిన సర్వేలు.. బీజేపీకి ప్రతిపక్ష హోదాతో సరిపెట్టాయి. పోల్ సర్వేలు కాంగ్రెస్ శ్రేణులలో మరింత జోష్ నింపగా.. బీజేపీని ఢిపెన్స్‌లో పడేశాయి.
పోల్ ఆఫ్ పోల్స్(poll of polls), ఏబీపీ సీ(ABPC) ఓటర్, డెయిలీ ట్రాకర్(Daily trackers), లోక్ పోల్(Lok poll) సర్వేల ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఏబీపీ సీ ఓటర్ సర్వే
• కాంగ్రెస్ : 115-127
• బీజేపీ : 68-80
• జేడీఎస్ : 23-35
పోల్ ఆఫ్ పోల్స్ సర్వే
• కాంగ్రెస్: 134-140
• బీజేపీ: 54-61
• జేడీఎస్ : 17-20
• ఇతరులు : 0-3
డెయిలీ ట్రాకర్
• కాంగ్రెస్ : 153
• బీజేపీ : 42
• జేడీఎస్ : 17
• ఇతరులు : 12
లోక్ పోల్ సర్వే
• కాంగ్రెస్: 128-131
• బీజేపీ : 66-69
• జేడీఎస్ : 21-25
• ఇతరులు : 0-2
సర్వేల ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందో లేదో ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే.
