మే 10న(May 10) కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly elections) జరగనున్నాయి. అధికారం కోసం కాంగ్రెస్(congress) పావులు కదుపుతుండగా.. బీజేపీ(BJP) మాత్రం విజయాన్ని పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల‌ నాయకులు తమదే గెలుపు అని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

మే 10న(May 10) కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly elections) జరగనున్నాయి. అధికారం కోసం కాంగ్రెస్(congress) పావులు కదుపుతుండగా.. బీజేపీ(BJP) మాత్రం విజయాన్ని పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల‌ నాయకులు తమదే గెలుపు అని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌చారం నేటితో ముగియ‌నున్న క్ర‌మంలో ఎన్నికల సంఘం పార్లీల‌కు ఓ సూచ‌న చేసింది. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC) అనుమతి లేకుండా ఎన్నికల రోజు, ముందు రోజు ప్రింట్ మీడియాలో ఏ పార్టీ లేదా అభ్యర్థి ఎటువంటి ప్రకటనను ప్రచురించకూడదని ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ఎవరైనా ప్ర‌క‌ట‌న ద్వారా ప్రచారం చేయాలనుకుంటే ముందుగా ఎంసీఎంసీ నుండి అనుమతి తీసుకోవాలని స్ప‌ష్టం చేసింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Karnataka assembly election campaign) సోమవారం(monday) సాయంత్రం 5 గంటలకు ముగియనుండటం గమనార్హం. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోవడంతో ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు జారీ చేసిన గైడ్‌లైన్స్‌లో.. మర్యాదపూర్వకంగా ప్ర‌క‌ట‌న‌లు చేయాలని ఉద్ఘాటించింది. అభ్యంతరకరమైన‌, తప్పుదోవ పట్టించే ప్రకటనలు మొత్తం ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తాయని ఎల‌క్ష‌న్‌ కమిషన్ పేర్కొంది.

కర్ణాటకలోని వార్తాపత్రికల యాజ‌మాన్యాల‌కు కూడా ఎన్నికల సంఘం ప్రత్యేక లేఖ రాసింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. పాత్రికేయ ప్రవర్తన, నిబంధనల ప్రకారం వార్తాపత్రికలలో ప్రచురించబడే ప్రకటనలతో సహా అన్ని విషయాలకు వారే బాధ్యత వహించాల్సివుంటుంద‌ని స్పష్టం చేసింది.

రాజకీయ పార్టీలకు జారీ చేసిన గైడ్‌లైన్స్‌లో.. ఎన్నికల రోజు, ముందు రోజు ప్రచారంపై నిషేధం సమయంలో ప్రకటనలను ఎంసీఎంసీ ద్వారా ముందస్తు ధృవీకరణ చేయవలసి ఉంటుంది. రాజకీయ ప్రకటనలోని కంటెంట్‌ను ఎంసీఎంసీ ఆమోదించని పక్షంలో.. ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి లేదా మరే ఇతర సంస్థ లేదా వ్యక్తి.. పోలింగ్ రోజు, ముందు రోజు ప్రింట్ మీడియాలో ఎటువంటి ప్రకటనను ప్రచురించకూడదని పేర్కొంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రకటన ప్రచురించే ప్రతిపాదిత తేదీకి రెండు రోజుల ముందు ఎంసీఎంసీకి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Updated On 8 May 2023 12:24 AM GMT
Ehatv

Ehatv

Next Story