దేశంలో మరో కీలక ఎన్నికకు నగరా మోగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్(Karnataka Assembly Election Schedule)ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మే 10న ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Karnataka Election Dates 2023
దేశంలో మరో కీలక ఎన్నికకు నగరా మోగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్(Karnataka Assembly Election Schedule)ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మే 10న ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాలను అదే రోజు వెల్లడిస్తారు. కర్ణాటకలో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. 224 అసెంబ్లీ స్థానాలలో 36 స్థానాలను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 15 స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 20 కాగా, మరుసటి రోజున అంటే ఏప్రిల్ 21న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 24. మే 15 తేదీ కల్లా ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్ల మంది అయితే మహిళలు 2.59 కోట్ల మంది. తొలిసారి 9.17 లక్షల మంది ఓటు హక్కును వినియోగించనున్నారు. ఈ ఎన్నికల నుంచి ఎన్నికల సంఘం మొదటిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కలిగించబోతున్నది. 80 ఏళ్లకు పైబడిన వారు, దివ్యాంగులు , అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. కర్ణాటకలో మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత అసెంబ్లీ మే 25తో ముగుస్తుంది. ప్రస్తుత అసెబ్లీలో బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
