కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభం కాగా, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉండడంతో అభ్యర్థులంతా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని, మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు(Karnataka Assembly Election Counting) ఈ ఉదయం ప్రారంభం కాగా, కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉండడంతో అభ్యర్థులంతా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు(Vote Count) ప్రారంభమైందని, మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. మే 10న రాష్ట్రంలోని 224 మంది సభ్యుల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ‘రికార్డు’ 73.19 శాతం ఓటింగ్ నమోదైంది. కర్ణాటకలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బెంగళూరు అర్బన్ డీసీ దయానంద్ కేఏ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి స్ట్రాంగ్ రూమ్(Strong Room), కౌంటింగ్ హాల్(Counting Hall), కౌంటింగ్ సెంటర్ ప్రాంగణంలో సరిపడా పోలీసు(Police) సిబ్బందిని మోహరించారు.
మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత సలీం అహ్మద్(Saleem Ahmad) ప్రకటించారు. కర్ణాటక ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని, ప్రస్తుత ప్రభుత్వంతో విసిగిపోయారని సలీం అన్నారు. కాంగ్రెస్ మద్దతుదారులు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల సందడి చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకాకముందే.. ఉదయం నుంచే ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు డప్పులు కొడుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. తొలి ట్రెండ్‌లో కాంగ్రెస్ ముందుంది. కాంగ్రెస్‌కు 60 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.