కర్ణాటకలో(Karnataka) జంపింగులు మొదలయ్యాయి. దాంతో రాజకీయం హీటెక్కింది. టికెట్ దొరకని నేతలు నిర్మోహమాటంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. ఎన్నికలు(Elections) సమీపిస్తున్నవేళ సీనియర్ నేతలు కండువాలు మార్చేస్తున్నారు.
కర్ణాటకలో(Karnataka) జంపింగులు మొదలయ్యాయి. దాంతో రాజకీయం హీటెక్కింది. టికెట్ దొరకని నేతలు నిర్మోహమాటంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. ఎన్నికలు(Elections) సమీపిస్తున్నవేళ సీనియర్ నేతలు కండువాలు మార్చేస్తున్నారు. అధికార భారతీయ జనతాపార్టీ(BJP) ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాలను ప్రకటించింది. గెలిచే వారికే టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కొందరు సిట్టింగులకు మొండిచేయి చూపించింది. సీనియర్లు అన్నది కూడా చూడకుండా టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. కొత్తగా 52 మందికి అవకాశం ఇచ్చింది. సహజంగానే సిట్టింగులకు ఇది కోపం తెప్పించింది. దాంతో పాటు ఆశావహులు కూడా అలిగారు. అవమానంగా ఫీలవుతున్నారు. అందుకే ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు.
మొన్న బీజేపీకి(BJP) రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం(Deputy CM) లక్ష్మణ్ సవాదీ(Lakshman savadi) కాంగ్రెస్‌పార్టీలో(Congress) చేఆరు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shiva kummar), మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వెంటనే అథని అసెంబ్లీ స్థానం నుంచి ఆయనను బరిలో దింపుతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడాయన బీజేపీతో పోరాటం చేస్తారన్నమాట! అథని నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ సవాదీ మూడుసార్లు విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు విశ్వాసపాత్రుడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ కుమతహల్లి చేతిలో పరాజయంపాలైన లక్ష్మణ్ లింగాయత్ సామాజికవర్గానికి చెందినవారు. లింగాయత్‌లలో ఈయన పేరున్న నాయకుడు. 2019లో కాంగ్రెస్, జేడీ (ఎస్)ల నుంచి బీజేపీలోకి చాలా మంది చేరారు. ఈ చేరికలో లక్ష్మణ్‌దే కీలక పాత్ర. ఇప్పుడాయన కాంగ్రెస్‌లో చేరడమే రాజకీయ వైచిత్రి. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రఘు అచర్ జేడీ(ఎస్)లోకి వెళ్లిపోయారు. ఇంకెన్నీ జంపింగ్ జపాంగ్‌లను చూడాలో!