కర్ణాటకలో(Karnataka) కాంగ్రెస్ పార్టీ(Congress) ఇచ్చిన అయిదు గ్యారంటీలలో(guarantees) ముఖ్యమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Travel). ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. ఇప్పటిదాకా ఉచిత బస్సు పథకం కింద 100 కోట్లకు పైగా ప్రయాణాల మార్కును విజయవంతంగా నడిపింది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం. శక్తి గ్యారంటీ పథకాన్ని(Shakti Scheme) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య జూన్ 11 న ప్రారంభించారు. 160 రోజుల్లోనే 100,47,56,184 ప్రయాణాలు దాటడం విశేషం. ముఖ్యంగా బెంగుళూరులో(Bangalore) ఎక్కవ మంది ఫ్రీ బస్సు(Free Bus) సౌకర్యాన్ని ఉఫయోగించుకోగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ గణనీయ సంఖ్యలో ఫ్రీ బస్సు సౌకర్యం ద్వారా లబ్ది పొందారు.

కర్ణాటకలో(Karnataka) కాంగ్రెస్ పార్టీ(Congress) ఇచ్చిన అయిదు గ్యారంటీలలో(guarantees) ముఖ్యమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Travel). ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. ఇప్పటిదాకా ఉచిత బస్సు పథకం కింద 100 కోట్లకు పైగా ప్రయాణాల మార్కును విజయవంతంగా నడిపింది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం. శక్తి గ్యారంటీ పథకాన్ని(Shakti Scheme) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య జూన్ 11 న ప్రారంభించారు. 160 రోజుల్లోనే 100,47,56,184 ప్రయాణాలు దాటడం విశేషం. ముఖ్యంగా బెంగుళూరులో(Bangalore) ఎక్కవ మంది ఫ్రీ బస్సు(Free Bus) సౌకర్యాన్ని ఉఫయోగించుకోగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ గణనీయ సంఖ్యలో ఫ్రీ బస్సు సౌకర్యం ద్వారా లబ్ది పొందారు. పథకం ప్రారంభించిన మొదటి నెల అంటే జూన్‌లో అత్యధిక సంఖ్యలో మహిళా ప్రయాణికులు 10,54,45,047 మంది ఉన్నారు. జూలైలో ఈ సంఖ్య 19,63,00,625 వద్ద స్వల్పంగా తగ్గి ఆగస్టులో మళ్లీ పెరిగి 20,03,60,680కి చేరుకుంది. సెప్టెంబర్‌లో 18,95,49,754 మంది ప్రయాణికులు పథకం ప్రయోజనాలను పొందారు. గత నెలలో రాష్ట్రంలో 18,26,17,460 మంది లబ్ధిదారులు ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందారు. శక్తి పథకం అమలుకు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.2,400 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. పథకం పట్ల రాష్ట్రంలోని మహిళలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజువారి పనులకు వెళ్లాలంటే బస్సు చార్జీలకు డబ్బులు ఖర్చయి, ఆర్థికంగ నష్టపోయేవాళ్లమని, కానీ ఫ్రీ బస్సు సౌకర్యంతో ఆర్థిక వెసులుబాటు కలుగుతోందిని మహిళలు చెబుతున్నారు. చదువుకునే యువతులకు సైతం ఫ్రీ బస్సు సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతోంది. రోజూ కాలేజీకి వెళ్లి రావడానికి చాలా ఉచిత బస్సు సౌకర్యం ఎంతగానో ప్రయోజనకరంగా ఉందని విద్యార్థినులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ఫథకాన్ని విజయవంతంగా అమలుచేయడంతో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటక పథకాన్ని అమలుచేయడంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.

Updated On 24 Nov 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story