కర్నాటకలోని బెళగావి(Belagavi) దగ్గర ఉన్న ఓ గ్రామంలో యువతీ, యువకుడు కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి ఇంట్లో తెలిసింది. వీరి ప్రేమ వ్యవహారం ఇష్టం లేని యువతి కుటుంబసభ్యులు ఆమె మరొకరితో పెళ్లి నిశ్చయించారు. మరో యువకుడితో ఎంగేజ్‌మెంట్‌(Engagement) కూడా చేశారు. పెళ్లి ఇష్టం లేని ఆ యువతి ప్రియుడితో కలిసి పారిపోయారు. దీంతో ఆగ్రహం చెందిన యువతి కుటుంబసభ్యులు యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు.

కర్నాటకలో(Karnataka) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తమ కూతురు ప్రియుడితో వెళ్లిపోయిందని.. అతని తల్లిని నగ్నంగా ఊరేగించారు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు. కుమారుడిపై ఉన్న కోపాన్ని తల్లిపై తీసుకున్నారు. ఆమెను అతి దారుణంగా హింసించారు. వివరాల్లోకి వెళ్తే..

కర్నాటకలోని బెళగావి(Belagavi) దగ్గర ఉన్న ఓ గ్రామంలో యువతీ, యువకుడు కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి ఇంట్లో తెలిసింది. వీరి ప్రేమ వ్యవహారం ఇష్టం లేని యువతి కుటుంబసభ్యులు ఆమె మరొకరితో పెళ్లి నిశ్చయించారు. మరో యువకుడితో ఎంగేజ్‌మెంట్‌(Engagement) కూడా చేశారు. పెళ్లి ఇష్టం లేని ఆ యువతి ప్రియుడితో కలిసి పారిపోయారు. దీంతో ఆగ్రహం చెందిన యువతి కుటుంబసభ్యులు యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు.

అంతేకాకుండా అతడి తల్లిని బయటకు ఈడ్చుకొని వెళ్లి ఆమెను నగ్నంగా(Nude) చేశారు. నగ్నంగానే ఆ ఊరి వీధుల్లో పరిగెత్తించారు. రచ్చబండ ఉన్న స్తంభానికి కట్టేసి అతి దారుణంగా హింసించారు. ఆమె ఒంటినిండా గాయాలయ్యేలా చితకబాదారు. ఇదంతా చూస్తున్న స్థానికులు ఎవరూ దీనికి అడ్డుచెప్పలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని బాధితురాలిని రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు.

కర్నాటక హోంమంత్రి పరమేశ్వర్(Parameswar) బాధితురాలని పరామర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. ఈ ఘటనపై సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) స్పందించారు. ఆధునిక సమాజంలో ఇలాంటి ఘటనలకు తావులేదని.. ఇది సమాజానికే సిగ్గుచేటని చెప్పారు. నిందితులు సమాజాన్ని తల దించుకునేలా చేశారని సిద్దరామయ్య అన్నారు. ఇలాంటి హింసలకు తావులేదని.. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని ట్విట్టర్‌(Twitter) ద్వారా ప్రకటించారు.

Updated On 12 Dec 2023 12:46 AM GMT
Ehatv

Ehatv

Next Story