కర్ణాటకలో(Karnataka) బీజేపీ(BJP) హయాంలో కల్యాణ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి మండలి (కేకేఆర్‌డీబీ)లో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఫిర్యాదు చేయ‌గా.. ప్రభుత్వం ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించింది. కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డులోనే కాకుండా..

కర్ణాటకలో(Karnataka) బీజేపీ(BJP) హయాంలో కల్యాణ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి మండలి (KKRDB)లో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఫిర్యాదు చేయ‌గా.. ప్రభుత్వం ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించింది. కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డులోనే కాకుండా.. ఇలాంటి మోసాలు ఎన్నో జరిగాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva kumar) అన్నారు. న్యాయం చేస్తాం, త్వరలోనే అన్ని కుంభకోణాలపై విచారణకు ఆదేశిస్తామ‌న్నారు.

కళ్యాణ కర్ణాటక రీజినల్ డెవలప్‌మెంట్ బోర్డ్‌ను గతంలో హైదరాబాద్ కర్ణాటక రీజినల్ డెవలప్‌మెంట్ బోర్డ్ అని పిలిచేవారు. ఇది 2013 సంవత్సరంలో ఏర్పాటైంది. బీదర్, బళ్లారి, కలబురగి, కొప్పల్, రాయచూర్, యాద్గిర్ జిల్లాల అభివృద్ధి బాధ్యత ఈ బోర్డుపై ఉంది.

కొన్ని నెలల క్రితం సామాజిక కార్యకర్త గురునాథ్ వడ్డే(Gurunath vadde).. కేకేఆర్‌డీబీలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ(CBI) విచారణకు డిమాండ్ చేశారు. బోర్డు టెండర్లు జారీ చేయడంలో అవినీతి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బోర్డుకు ఇచ్చిన నిధులు కూడా ఖర్చు చేయలేదు. బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపించడంతోపాటు నిధుల పంపిణీలోనూ వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో నిబంధనలను విస్మరించడంతోపాటు అభివృద్ధి పనుల ఆడిట్ చేయడం లేదని ఆరోపించారు. ఇప్పుడు ఈ కుంభకోణంపై కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రియాంక్ ఖర్గే ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు.

Updated On 30 May 2023 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story