2013-18 మధ్య కర్నాకలో(Karnataka) నిర్వహించిన సామాజిక-ఆర్థిక కులాల సర్వే నివేదిక దుమ్ము దులపాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్లుగా కోల్డ్ స్టోరేజీలో(Cold Storage) ఉన్న ఈ నివేదికకు ఆమోదం తెలపనున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
2013-18 మధ్య కర్నాకలో(Karnataka) నిర్వహించిన సామాజిక-ఆర్థిక కులాల సర్వే నివేదిక దుమ్ము దులపాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్లుగా కోల్డ్ స్టోరేజీలో(Cold Storage) ఉన్న ఈ నివేదికకు ఆమోదం తెలపనున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. బుధవారం తన నివాసంలో కలిసిన 150 మందికిపైగా వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. ఇటీవల కర్నాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామ్య నేతృత్వలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో వెనుకబడిన తరగతుల కమిషన్ సమర్పించిన సామాజిక-ఆర్థిక కులాల సర్వే నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కర్నాటక రాజకీయాల్లో దుమారం రేగనుంది. 2018లో లీక్ అయిన కొన్ని కుల గణన ఫలితాలు, రాష్ట్రంలోని లింగాయత్‌లు, వొక్కలిగాలు వంటి ఆధిపత్య కులాల జనాభా వారు చెప్పుకున్నంత సంఖ్యలో ఉండకపోవచ్చని సూచించాయి. దీంతో కులాల జన గణన నివేదికపై లింగాయత్, వొక్కలింగ సామాజిక వర్గాలు గుర్రుగా ఉన్నాయి.
2013-18 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, కుల-గణన నివేదికను రూపొందించే సింగిల్ పాయింట్ ఎజెండాతో కాంతరాజు కమిషన్‌ను ఏర్పాటు చేశారు.దీని కోసం రూ. 130 కోట్ల ఖర్చు చేశారు. అయితే నివేదికను మాత్రం బయట
పెట్టలేదు. 2018 డిసెంబర్ నాటికే కమిషన్ సర్వే పూర్తి చేసినప్పటికీ సరైన ఫార్మాట్‌లో ప్రభుత్వానికి సమర్పించలేదు.
మరోవైపు ఎన్నికలు సమీపించడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నివేదికను అసెంబ్లీలో ప్రకటించడానికి మొగ్గుచూపలేదు. దీంతో కర్నాటక కులాల జనగణన నివేదిక కోల్ట్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ప్రభుత్వం ఈ నివేదికను బయటపెట్టే సాహసం చేయలేదు. కులాల జనగణన నివేదికను విడుదల చేయాలని వివిధ సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. కులాల జన గణనను బహిరంగంగా ఆమోదించడానికి రాష్ట్ర ప్రభుత్వం “ఓపెన్ మైండ్” ఉందని చెప్పిన అప్పటి సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాస్, సాంకేతిక సమస్యలున్నాయన్నారు. నివేదిక స్థితిగతులపై కమిషన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాలయాపన చేశారే తప్పా బయటపెట్టే సాహసం చేయలేదు.
1931 తర్వాత కర్నాటకలో కులాల జనగణన నిర్వహించడం ఇదే మొదటిసారి. సామాజిక న్యాయం, సాధికారత కార్యక్రమాలు ప్రారంభించాలంటే.. వివిధ తరగతుల జనాభాను నిర్ణయించాలని, అందుకు దేశవ్యాప్తంగా కుల జన గణనను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు సూచనగా, 2015లో వెనుకబడిన తరగతుల కమిషన్ ఇచ్చిన సామాజిక-ఆర్థిక సర్వే ఫలితాలను విడుదల చేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకరించారు. కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలకు వెళ్లే ముందు 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి, లింగాయత్, వొక్కలింగ సామాజిక వర్గాలకు చెరో 2 శాతం పెంచడం వివాదాస్పదమైంది. దీనిపై కర్నాటకలోని ఇతర సామాజిక వర్గాలు తీవ్ర అసహనంగా ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉంటూ ఈ రెండు సామాజిక వర్గాలే సింహభాగం పదవులను అనుభవిస్తున్నాయని బీసీలు, ఎంబీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలోని అనేక సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే కమిషన్ ఇచ్చిన కుల జన గణన ఆధారంగా కోటాను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కులాల వారీగా సర్వే ఎంతో ఉపయోపడుతుందని అన్నారు. రిజర్వేషన్ల అమలుతోపాటు వివిధ కులాలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఖచ్చితమైన, శాస్త్రీయపరమైన డేటా కోసమే ఈ సర్వే నిర్వహించినట్టు చెప్పారు. రిజర్వేషన్ మ్యాట్రిక్స్‌లో గత బీజేపీ ప్రభుత్వం సృష్టించిన గందరగోళాన్ని అందుబాటులో ఉన్న సర్వే డేటా మాత్రమే పరిష్కరించగలదని అన్నారు. సరైన సమాచారం లేకపోతే సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు. త్వరలోనే కులాల జన గణన నివేదికను ఆమోదిస్తామని ప్రకటించారు.
అయితే కుల జనగణన నివేదికకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమోదం తెలుపుతామనడం.. రాజకీయ ప్రాబల్యం కలిగిన లింగాయత్‌లు, వొక్కలింగాలకు ఏ మాత్రం మింగుడుపడకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.