కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి, మంత్రివర్గం గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అన్ని కాంగ్రెస్ "సారూప్య" పార్టీలకు ఆహ్వానాలు పంపిన‌ట్లు స‌మాచారం.

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి(Karnataka New Cheif Minister), మంత్రివర్గం(Cabinet) గురువారం ప్రమాణస్వీకారం(Oath) చేయనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అన్ని కాంగ్రెస్ "సారూప్య" పార్టీలకు ఆహ్వానాలు పంపిన‌ట్లు స‌మాచారం. కర్ణాటక మంత్రివర్గం తుది రూపురేఖలు ఒకటి రెండు రోజుల్లో పూర్త‌వుతాయ‌ని పార్టీకి సంబంధించిన‌ నేత‌లు చెబుతున్నారు.

224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్(Congress) 135 సీట్లను కైవసం చేసుకుంది. నిన్నటి వరకు దక్షిణాదిలో బీజేపీ(BJP) ఏకైక కంచుకోట అయిన కర్ణాటకలో ఆపార్టీకి అధికారం లేకుండా పోయింది. 2018 రాష్ట్ర ఎన్నికలలో 104 స్థానాలు నెగ్గిన బీజేపీ.. ఈ సారి 66 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేసిన ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదు. కర్ణాటకలో 51 రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉన్నాయి.. వాటిలో 36 షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు, 15 ఎస్టీ అభ్యర్థులకు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఈరోజు ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ముఖ్యమంత్రి ఎంపికను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడికే వదిలేస్తూ కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) తీర్మానం చేయనుంది. ఈరోజు తుది నిర్ణయం తీసుకోలేమని, అయితే అందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుంటామని సంబంధిత వర్గాలు తెలిపాయి. కర్ణాటక సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్ పరిశీలకులుగా ఉన్నారు.

Updated On 14 May 2023 7:44 AM GMT
Yagnik

Yagnik

Next Story