కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly Elections) సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనలతో బిజీ అయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకు సవాల్‌గా మారింది. టికెట్‌ దొరకని వారు అధిష్టానాలపై కస్సుబుస్సుమంటున్నారు. వీరికి సర్దిచెప్పలేక అధినాయకత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ(BJP)లో అసంతృప్తి మొదలయ్యింది. మొన్న విడుదల చేసిన తొలి జాబితాపైనే పలువురు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. టికెట్‌ వస్తుందని ఎంతో ఆశతో ఉన్నవారికి నిరాశ ఎదురుకావడంతో పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly Elections) సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనలతో బిజీ అయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకు సవాల్‌గా మారింది. టికెట్‌ దొరకని వారు అధిష్టానాలపై కస్సుబుస్సుమంటున్నారు. వీరికి సర్దిచెప్పలేక అధినాయకత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ(BJP)లో అసంతృప్తి మొదలయ్యింది. మొన్న విడుదల చేసిన తొలి జాబితాపైనే పలువురు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. టికెట్‌ వస్తుందని ఎంతో ఆశతో ఉన్నవారికి నిరాశ ఎదురుకావడంతో పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నారు. కొందరికి రాజకీయాలపైనే విరక్తి కలిగింది. దీంతోనే సతమతమవుతున్న బీజేపీ అధిష్టానికి నిన్న ప్రకటించిన రెండో జాబితా మరిన్ని తలనొప్పులను తెచ్చి పెట్టింది. 23 మంది అభ్యర్థులతో విడుదల చేసిన రెండో జాబితాలో ఏడుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ దొరకలేదు. 23 మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై కూడా కసరత్తు జరుగుతోంది. సెకండ్‌ లిస్టులో చాలా మంది సీనియర్లకు టికెట్‌ దొరకలేదు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్‌ పేరే లేదు. హుబ్బలి నియోజకవర్గం నుంచి ఆరుసార్లు విజయం సాధించిన జగదీశ్‌ ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకున్నారు. అధిష్టానం మాత్రం ఆయన పేరును ప్రకటించలేదు. హుబ్బలి కాకపోతే మరో చోటి నుంచైనా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తుందేమోనన్న ఆశతో జగదీశ్‌ ఉన్నారు. చివరి జాబితాలో తన పేరు లేకపోతే మాత్రం ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని హెచ్చరిస్తున్నారు.

వరుణలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోటీ చేస్తున్న వి.సోమన్న.. దీంతో సంతృప్తి పడకుండా గుబ్బి స్థానం నుంచి పోటీ చేసే అవకాశం తన కుమారుడుకి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. బీజేపీ పెద్దలు మాత్రం నో చెప్పారు. గుబ్బి నియోజకవర్గం నుంచి ఎస్‌.డి.దిలీప్‌కుమార్‌ను బరిలో దింపింది. అలాగే బైందూరు ఎమ్మెల్యే సుకుమార్‌ షెట్టికి కూడా టికెట్‌ దొరకలేదు. ఈ స్థానం నుంచి గురురాజ్‌ గంటిహోళీ నిల్చుంటున్నారు. అవినీతి ఆరోపణలపై అరెస్టయిన చన్నగిరి ఎమ్మెల్యే మాదాల్‌ విరూపాక్షప్పను లైట్‌ తీసుకుంది బీజేపీ. ఆ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం శివకుమార్‌కు ఇచ్చింది. దావణగెరె నార్త్‌ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌, హావేరి ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్‌లకు కూడా ఈసారి టికెట్లు దొరకలేదు. వీరి స్థానాలలో లోకికెరె నాగరాజు, గవి సిద్ధప్ప ద్యామన్నవర్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది.

తొలి జాబితాలో టికెట్‌ దొరకని వారిలో చాలా మంది బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి లక్ష్మణ్‌ సావాది అయితే అధిష్టానంపై మండిపడ్డారు. టికెట్ కోసం అడుక్కుతినను అంటూ పార్టీకి రాజీనామా చేశారు. మంగళూరు సుళ్య టికెట్‌ రాకపోవడంతో మంత్రి ఎస్‌. అంగార రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మాజీ మంత్రి కేఎస్‌.ఈశ్వరప్ప కూడా రాజకీయాల నుంచి వైదొలిగారు. మాజీ ఎమ్మెల్యే దొడ్డప్పగౌడ పాటిల్‌ నారిబోల్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టికెట్‌ దక్కని నేతలు అసంతృప్తితో పార్టీకి దూరమవుతుంటే అధిష్టానం ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటోంది.

Updated On 13 April 2023 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story