కర్నాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Polls)కు మరో నెల రోజుల సమయం ఉండడంతో అధికార బీజేపీ(BJP).. సోమవారం అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఖరారు కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆదివారం సాయంత్రం న్యూఢిల్లీలో సమావేశమైంది. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా రాష్ట్ర పార్టీ నేతలు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi), కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), అమిత్ షా(Amith Shah), బీజేపీ అధ్యక్షుడు […]

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Polls)కు మరో నెల రోజుల సమయం ఉండడంతో అధికార బీజేపీ(BJP).. సోమవారం అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఖరారు కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆదివారం సాయంత్రం న్యూఢిల్లీలో సమావేశమైంది. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా రాష్ట్ర పార్టీ నేతలు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi), కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), అమిత్ షా(Amith Shah), బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)తో సహా సీనియర్ బీజేపీ నేతలు అభ్యర్థుల జాబితాపై చర్చించారు.

సమావేశం అనంతరం బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ కొన్ని ‘డైరెక్షన్స్’ ఇచ్చారని, సోమవారం లేదా మంగళవారం అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. "మేము కర్నాటక ఎన్నికల కోసం బీజేపీ అభ్య‌ర్థుల‌ జాబితాపై చర్చించాము. బహుశా మేము రేపు కూర్చుంటాము. జాబితాను రేపు లేదా మరుసటి రోజు ప్రకటిస్తాము. నేను షిగ్గావ్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానని ఆయన ఆదివారం రాత్రి విలేకరులతో అన్నారు.

ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురి పేర్లను సూచిస్తూ పార్టీ రాష్ట్ర శాఖ గతవారం జాబితాను రూపొందించింది. తుది జాబితాను సిద్ధం చేసి షార్ట్‌లిస్ట్‌ను సీఈసీకి సమర్పించిన‌ట్లు స‌మాచారం. 140 మందికి పైగా పేర్లను ఖరారు చేసిన‌ట్లు.. ఇందులో పెద్ద‌గా మ‌ర్పులేమి ఉండబోవని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది సిట్టింగ్ ల‌కు మ‌రో అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు మీడియా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

కోలారు, వరుణ వంటి కీలక నియోజకవర్గాల్లో పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెడుతుందని ద‌క్క‌న్ హెరాల్డ్ నివేదించింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సీఎం అభ్యర్థి సిద్ధరామయ్య(Siddaramaiah) వరుణ నియోజకవర్గం నుండి ఎన్నికల బ‌రిలో ఉంటుండ‌గా.. గృహనిర్మాణ శాఖ మంత్రి వి సోమన్నను బీజేపీ బ‌రిలో ఉంచ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల(Assembly Polls)కు ఇప్ప‌టికే 166 స్థానాలకు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌.. మిగిలిన 58 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు హైకమాండ్ సమావేశమైంది. రెండు జాబితాలను ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌(Congress).. మూడో జాబితాను త్వరలో ప్ర‌క‌టించే అవకాశం ఉంది.

క‌ర్ణాట‌క‌లో మళ్లీ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ(BJP).. 224 సీట్లలో కనీసం 150 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుంది. మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే 13న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Updated On 9 April 2023 11:29 PM GMT
Yagnik

Yagnik

Next Story