'ఉచిత పథకాల హామీలపై జాగ్రత్తగా ఉండండి. ఉచితాలు అభివృద్ధికి విఘాతం కలిగిస్తాయి' ఇది ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) నోటి వెంట వచ్చిన మాటలు! కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections) సందర్భంగా ఆ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌(Video conference)లో అన్న మాటలు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకుందని ఆయన వ్యాఖ్యానించారు.

'ఉచిత పథకాల హామీలపై జాగ్రత్తగా ఉండండి. ఉచితాలు అభివృద్ధికి విఘాతం కలిగిస్తాయి' ఇది ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) నోటి వెంట వచ్చిన మాటలు! కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections) సందర్భంగా ఆ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌(Video conference)లో అన్న మాటలు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకుందని ఆయన వ్యాఖ్యానించారు. 'డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే కర్ణాటక అభివృద్ధి చెందుతుందని, ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని మోదీ అన్నారు. బీజేపీకి, ఇతర పార్టీలకు మధ్య హస్తిమశకాంతరం తేడా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ఎలాగైనా సరే అధికారంలోకి రావడమే ప్రత్యర్థుల ఎజెండా అని, కానీ తాము మాత్రం పాతికేళ్ల భవిష్యత్తు అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ వారంటీ డేట్‌ ముగిసిందని సెటైర్‌ వేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో 12 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ పనిలో నిమగ్నమయ్యాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార బీజేపీ వ్యూహరచన చేసుకుంటోంది. ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే పేరున్న నాయకులను రంగంలోకి దింపింది. సినిమా తారలతో కూడా ప్రచారం చేయిస్తోంది. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొనబోతున్నారు. ఆయన ఏకంగా పది రోజుల పాటు ప్రచారం చేస్తారు. ఈ సమయంలో మోదీ దాదాపు 20 ర్యాలీలలో, భారీ బహిరంగసభల్లో పాల్గొంటారు.

తెలుగువారు ఎక్కవ సంఖ్యలో ఉండే చిక్‌బల్లాపూర, కోలార్‌ జిల్లాలలోని నియోజకవర్గాలలో శుక్ర, శనివారాలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay) ప్రచారం చేయనున్నారు. కర్ణాటక పార్టీ సహ ఇన్‌ఛార్జ్‌గా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ(DK Aruna) ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

Updated On 27 April 2023 4:47 AM GMT
Ehatv

Ehatv

Next Story