రాజకీయంతో ఆయన వ్యాపారం చేశాడో, వ్యాపారాన్ని రాజకీయానికి వాడుకున్నాడో తెలియదు కానీ కర్ణాటక(Karnataka)కు చెందిన ఓ మంత్రిగారు మాత్రం బోల్డంత సంపాదించేశారు. హోసకోటె(Hoskote)కు చెందిన ఎం.టి.బి.నాగరాజు(M.T.B. Nagaraju) ఆస్తి ఎంతో తెలిస్తే హాశ్చర్యపోతారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్(affidavit)లో తన పేరుమీద 1,609 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పుడాయన హోసకోటె నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ(BJP) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
రాజకీయంతో ఆయన వ్యాపారం చేశాడో, వ్యాపారాన్ని రాజకీయానికి వాడుకున్నాడో తెలియదు కానీ కర్ణాటక(Karnataka)కు చెందిన ఓ మంత్రిగారు మాత్రం బోల్డంత సంపాదించేశారు. హోసకోటె(Hoskote)కు చెందిన ఎం.టి.బి.నాగరాజు(M.T.B. Nagaraju) ఆస్తి ఎంతో తెలిస్తే హాశ్చర్యపోతారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్(affidavit)లో తన పేరుమీద 1,609 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పుడాయన హోసకోటె నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ(BJP) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్నప్పుడు నామినేషన్ వేయాలిగా! నామినేషన్ అన్నాక ఆస్తుల చిట్టా చెప్పాలిగా! అలా ఆయన ఆస్తులెంతో పది మందికి తెలిసింది. ఆయన పేరిట అంతేసి ఆస్తి ఉంటే, ఆయన భార్య పేరిట 536 కోట్ల రూపాయల చరాస్తులు, 1,073 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. పాపం వీరిద్దరికి కలిపి 98.36 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.
2018 అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections 2018)ల్లో కాంగ్రెస్(Congress) తరఫున పోటీ చేసి విజయం సాధించారు నాగరాజు. అప్పుడాయన అఫిడవిట్‌లో 1,120 కోట్ల రూపాయల ఆస్తులు ప్రకటించారు. ఆ తర్వాత జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయి బీజేపీ అధికారంలో వచ్చింది. ఆ సమయంలో మూకుమ్మడిగా రాజీనామా చేసిన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నాగరాజు కూడా ఒకరు. బీజేపలో చేరిన తర్వాత 2012 ఉప ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో 1,220 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో నాగరాజు ఓడిపోయారు. అటు పిమ్మట విధాన పరిషత్తుకు ఎన్నికయ్యారు. మంత్రి పదవిని కూడా చేపట్టారు. మొత్తం మీద ఈ అయిదేళ్లలో ఆయన ఆస్తుల విలువ 500 కోట్ల రూపాయలు పెరిగింది. ఇంతకీ ఈయన ఏం చదివాడో తెలిస్తే బిత్తరపోతారు. నాగరాజు చదివింది తొమ్మిదో తరగతే! రియలెస్టేట్ వ్యాపారంలో బోల్డంత సంపాదించారు. ఆడపదడపా వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారు..