కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు(Karnataka PCC Chief) డీకే శివకుమార్(D. K. Shivakumar)కూడా కోట్లకు పడగలెత్తినవారే! ఎన్నికల నామినేషన్ అఫిడవిట్(affidavit)లో పేర్కొన్న ఆస్తుల వివరాలు చూస్తే షాకవ్వడం ఖాయం. ఆయన ఆస్తుల విలువ మొత్తం 1,139 కోట్ల రూపాయలు. దీంతో పాటు 263 కోట్ల రూపాయల అప్పు కూడా ఉంది. 2018 ఎన్నికలప్పుడు అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల విలువతో పోలిస్తే ఈసారి 67 శాతానికి పైగా ఆస్తులు పెరిగాయి. ఆస్తులకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ నేతల్లో ఈయనే టాప్!
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు(Karnataka PCC Chief) డీకే శివకుమార్(D.K. Shivakumar)కూడా కోట్లకు పడగలెత్తినవారే! ఎన్నికల నామినేషన్ అఫిడవిట్(affidavit)లో పేర్కొన్న ఆస్తుల వివరాలు చూస్తే షాకవ్వడం ఖాయం. ఆయన ఆస్తుల విలువ మొత్తం 1,139 కోట్ల రూపాయలు. దీంతో పాటు 263 కోట్ల రూపాయల అప్పు కూడా ఉంది. 2018 ఎన్నికలప్పుడు అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల విలువతో పోలిస్తే ఈసారి 67 శాతానికి పైగా ఆస్తులు పెరిగాయి. ఆస్తులకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ నేతల్లో ఈయనే టాప్! డీకే శివకుమార్ దగ్గర ఓ కారు, రెండు ఖరీదైన వాచ్‌లు, రెండు కిలోల బంగారం, 12 కిలోల వెండి కూడా ఉంది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న షాజియా తర్రానుమ్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. ఈయన ఆస్తుల విలువ ఎంతనుకున్నారు? 1,629 కోట్ల రూపాయలు. మంత్రి, బీజేపీ నేత నాగరాజు కూడా ఈయన తర్వాతే! బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేస్తున్న చాలా మంది అభ్యర్థులు కోటీశ్వరులే!