దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections) ప్రచారపర్వం మరికాసేపట్లో ముగుస్తుంది. అధికారాన్ని నిలుపుకునేందుకు భారతీయ జనతా పార్టీ(BJP) తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను ఉపయోగించింది. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections) ప్రచారపర్వం మరికాసేపట్లో ముగుస్తుంది. అధికారాన్ని నిలుపుకునేందుకు భారతీయ జనతా పార్టీ(BJP) తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను ఉపయోగించింది. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. చివరికి ఓ సినిమాను ప్రమోట్‌ చేసే స్థాయికి దిగజారింది. కర్ణాటక సార్వభౌమత్యవాన్ని కాపాడతామని కాంగ్రెస్‌ అన్న మాట పట్టుకుని నానా యాగి చేసింది.

భారతదేశం నుంచి కర్ణాటను వేరే చేసేందుకు కాంగ్రెస్‌(Congress) కుట్రలు పన్నుతున్నదని, అందుకోసం బహిరంగంగానే పిలుపునిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోజూ మొత్తం అంటూ పోయారు. తుక్డే తుక్డే గ్యాంగ్‌ వ్యాధి ఆ పార్టీలో టాప్‌ లెవల్‌కు చేరిందని అన్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే విషయంలో కాంగ్రెస్‌ రాజ కుటుంబం ముందంజలో ఉంటుందని ఆరోపించారు.

తన మనసులో చాలా బాధ ఉందని అన్నారు. భారత్‌ను ద్వేషించే విదేశీ ప్రతినిధులతో కాంగ్రెస్‌ పార్టీ రహస్యంగా సమావేశమవుతోందని, మన దేశ సార్వభౌమత్వాన్ని కించపర్చే చర్యలకు తరచుగా పాల్పడుతోందని, అందుకు ఆ పార్టీ ఏమాత్రం సిగ్గుపడడం లేదని నిరాధార ఆరోపణలు గుప్పించారు. నిన్నటి వరకు బజ్‌రంగ్‌బలిని నెత్తికెత్తుకున్న బీజేపీకి హఠాత్తుగా సార్వభౌమాధికారం అన్న పదం దొరకడంతో దాన్ని పట్టుకు వేలాడింది. అరిగిపోయిన రికార్డులా వల్లెవేసింది.

కర్ణాటకలో సర్వేలన్నీ కాంగ్రెస్‌దే విజయం అని చెప్పడంతో బీజేపీ కొత్త దారులు వెతకడం మొదలు పెట్టింది. ఇదే సమయంలో కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, బజరంగ్‌దళ్‌ ఈ రెండు మతపరమైన సంస్థలు కనుక విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అంతకు మించి ఏమైనా చేస్తే నిషేధించడానికి కూడా వెనుకాడమని చెప్పింది.

అంతే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు బజ్‌రంగ్‌దళ్‌ నిషేధాన్ని మరో రకంగా చెప్పడం మొదలు పెట్టింది. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్‌ అంటే బజరంగ్‌బలిని బందిస్తామని కాంగ్రెస్‌ అటోందని బీజేపీ ప్రచారం చేసింది. సాక్షాత్తూ ప్రధానమంత్రే ఆ మాట పదే పదే చెబుతూ వెళ్లారు. ప్రతీ ఎన్నికల్లో బీజేపీ ఏం చేస్తూ వచ్చిందో కర్ణాటకలోనూ అదే చేసింది. ద కేరళ స్టోరీ సినిమాను భుజానకెత్తుకుంది. ఆ సినిమాను ప్రధానమంత్రి ప్రమోట్‌ చేయడం విడ్డూరం.

ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రజల మధ్య మత విద్వేషాలను రగల్చడానికి భావోద్వేగాలతో ముడిపడిన ఏ చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ వదులుకోలేదు. ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలన్నదే బీజేపీ ధ్యేయం. మణిపూర్‌ మండిపోతున్నా లెక్కలేదు. జంతర్‌మంతర్‌లో మహిళా రెజర్లు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆందోళన చేస్తున్నా పట్టదు. అయిదుగురు సైనికులను ఉగ్రవాదులు చంపిస్తే ఖండించే తీరిక లేదు. విచారం వ్యక్తం చేసే సమయమూ లేదు.

కావాల్సిందల్లా కర్ణాటకలో విజయం. అధికారంలోకి వస్తే మెరుగైన పాలనను అందిస్తామని చెప్పకుండా బజరంగ్‌దళ్‌, హిజాబ్‌, హలాల్‌, లవ్‌ జిహాద్‌, టిప్పుసుల్తాన్‌, ముస్లిం రిజర్వేషన్లు, కేరళ స్టోరీలు, సార్వభౌమాధికారాలు గురించే చెబుతూ వచ్చింది బీజేపీ. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పింది. 40 శాతం కమిషన్‌ సర్కార్‌ను గద్దెదింపి, అవినీతి రహిత రాష్ట్రంగా కర్ణాటకకు తీర్చిదిద్దుతామని చెప్పింది

Updated On 8 May 2023 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story