పనిమీదో, చుట్టాలింటికో అక్కడికి వెళ్లారే అనుకోండి, సరదాగా కాసింత మందేసుకున్నారే అనుకోండి..
పనిమీదో, చుట్టాలింటికో అక్కడికి వెళ్లారే అనుకోండి, సరదాగా కాసింత మందేసుకున్నారే అనుకోండి..తాగేంతవరకు బాగానే ఉంటుంది. బిల్లు కట్టేటప్పుడు మాత్రం ఎక్కిందంతా చటుక్కుమని దిగిపోద్ది. కారణం మద్యం రేట్లే. చుక్కేసుకుందామంటే చుక్కలను అంటిన రేట్లు కిక్కు ఎక్కనివ్వవు. మందు(Alcohol) బాబులకు ఆంతగా నచ్చని ఆ రాష్ట్రం కర్ణాటక(Karnataka). అక్కడ మద్యం ధరలు(alcohol prices) చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే గోవా లో 100 రూపాయలకు దొరికే లిక్కర్ అక్కడ 513 రూపాయలు ఉంటుంది.గోవా లో మద్యం బాటిల్ ఎం ఆర్ పీ ధరలో 49 శాతం పన్ను గా ఉంటుంది. అదే కర్ణాటకలో 83 శాతం ఉంది. గోవాలో ఏ బ్రాండ్ లిక్కర్ బాటిల్ అయినా 100 రూపాయలు ఉండింది అనుకుందాం. అదే మద్యం బాటిల్ ఢిల్లీ లో 134 రూపాయలు అవుతుంది. హర్యానా లో 147 రూపాయలకు దొరుకుతుంది. ఉత్తరప్రదేశ్ లో 197 రూపాయలు అవుతుంది. రాజస్థాన్ లో 213 రూపాయలకు లభిస్తుంది. మహారాష్ట్రలో 226 రూపాయలు, తెలంగాణలో 246 రూపాయలు అవుతాయి. అంటే ఆయా రాష్ట్రాలలో పన్ను అంత ఉందన్న మాట.